
Vizhinjam Seaport: అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజిన్‌జమ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో నిర్మించిన కొత్త విజిన్‌జం బహుళ ప్రయోజనాల పోర్టును (Vizhinjam Seaport) ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితమిచ్చారు.
సుమారు రూ. 8,900 కోట్ల వ్యయంతో ఈ ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టు నిర్మితమైంది.
ఈ ప్రాజెక్టును కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రజా-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పోర్టును నిర్మించగా, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి.
పోర్టు ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా గౌతమ్ అదానీ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ఆయన సన్మానం చేశారు.
వివరాలు
విజిన్‌జం పోర్టు ప్రారంభంతో ఆ సమస్యకు పరిష్కారం
ఈ పోర్టు రూపకర్త ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని మంత్రి వి.ఎన్. వాసన్ వెల్లడించారు.
ప్రతి సంవత్సరం దేశానికి జరుగుతున్న సుమారు 22 కోట్ల డాలర్ల నష్టాన్ని ఈ పోర్టు తగ్గించగలదని సీఎం విజయన్ తెలిపారు.
గతంలో అవసరమైన సదుపాయాలు లేనందున దాదాపు 75 శాతం కంటైనర్ కార్గోలను విదేశాల్లోని పోర్టుల ద్వారా మళ్లించాల్సి వచ్చేది.
అయితే ఇప్పుడు విజిన్‌జం పోర్టు ప్రారంభంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుందని, ఇది దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రకారం ప్రకారం ఈ ప్రాజెక్టు 2045 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా, దశాబ్దం ముందే పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.
ఇప్పటికే ఈ పోర్టుకు 250 నౌకలు వచ్చాయని కూడా ఆయన తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓడరేవును జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీ
#WATCH | Thiruvananthapuram, Kerala: Prime Minister Narendra Modi dedicates to the nation 'Vizhinjam International Deepwater Multipurpose Seaport' worth Rs 8,900 crore
— ANI (@ANI) May 2, 2025
CM Pinarayi Vijayan is also present at the event. This ambitious project of the Kerala government has been… pic.twitter.com/t5bbfMuIUq