Page Loader
PM Modi degree Row: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్‌ తిరస్కరణ
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్‌ తిరస్కరణ

PM Modi degree Row: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్‌ తిరస్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2024
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలోని మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై విడుదలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌కు సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఎంపీ సంజయ్ సింగ్ తరఫు సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనానికి తన క్లయింట్ గుజరాత్ యూనివర్శిటీని కించపరచలేదని చెప్పారు .

గుజరాత్ యూనివర్సిటీ 

అసలు ఏమి జరిగిందంటే.. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌,సంజయ్‌ సింగ్‌లు ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై ప్రశ్నలు సంధిస్తూ ఆయన డిగ్రీ నకిలీదని అన్నారు. ఈ ప్రకటన తర్వాత,గుజరాత్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ అరవింద్ కేజ్రీవాల్,సంజయ్ సింగ్‌లపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ఇటువంటి ప్రకటనలతో విద్యార్థులకు విశ్వవిద్యాలయంపై విశ్వాసం కోల్పోతారని ఆరోపించారు. పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌,సింగ్‌లకు ట్రయల్‌ కోర్టు గతేడాది ఏప్రిల్‌లో సమన్లు ​​జారీ చేసింది. దీంతో ఇరువురు నేతలు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 26న కేజ్రీవాల్‌,సంజయ్‌ లకు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. దీని తరువాత, సింగ్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు, ఈరోజు సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది.