
Modi - Muhammad Yunus: మహమ్మద్ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నబంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌కు ఒక లేఖ అందింది.
ఈలేఖను బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ రాశారు.
బంగ్లాదేశ్ మార్చి 26నస్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది.ఈసందర్భంగా 1971లో భారత సైనిక సహాయంతో తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిన చారిత్రాత్మక ఘట్టాన్ని మోడీ ఈలేఖలో ప్రస్తావించారు.
ఈలేఖలో ప్రధాని మోడీ చరిత్రను గుర్తు చేస్తూ,1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట స్ఫూర్తిని భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య గట్టి సంబంధాలకు పునాదిగా పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారతదేశం పోషించిన కీలకపాత్రను గుర్తుచేశారు.
బంగాబంధు షేక్ ముజిబుర్ రెహ్‌మాన్ వారసత్వాన్నితుడిచిపెట్టివేయడానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో,మోడీ తన లేఖలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని ప్రస్తావించారు.
వివరాలు
షేక్ హసీనా తిరిగి రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలపై చర్చలు
బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ విడుదల చేసిన సందేశంలో, ప్రధాని మోడీ బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి, "ఈ రోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు గుర్తుగా నిలుస్తుంది. ఇవే మన ద్వైపాక్షిక సంబంధాల బలమైన పునాదులు" అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తిరిగి రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.
షేక్ హసీనా అధికారాన్ని వీడిన తర్వాత, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశంపై ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం గమనించదగిన అంశం.
అయితే, పలు రంగాల్లో భారతదేశంపై ఆధారపడిన బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్లీ దాని సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.