Page Loader
PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ 
ఎయిరిండియా విమాన ప్రమాదం.. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ

PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారు. ఆయన నేరుగా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అక్కడి అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. విమానం ఎలా కూలిందన్న అంశంపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు మోదీ సిద్ధమయ్యారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబాలకు ఓదార్పు అందించనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

విమాన దుర్ఘటన ఎలా జరిగింది? 

గురువారం మధ్యాహ్నం సమయంలో ఎయిర్‌ ఇండియా కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి కూలిపోయింది. విమానం, మెడికోలు ఉన్న హాస్టల్‌పై పడింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విమానంలో దాదాపు 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో ఇంధన లభ్యత ఎక్కువగా ఉండింది. కూలిపోవడం జరిగిన వెంటనే తీవ్ర మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ప్రాణ నష్టం వివరాలు 

దుర్ఘటన సమయంలో విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరు మినహించి మిగతావారంతా ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తు ఒక ప్రయాణికుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అంతేకాదు, మెడికో హాస్టల్‌లో ఉన్న 15 మంది విద్యార్థులు కూడా మృతిచెందినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన వివరాలు అందాల్సి ఉంది.

వివరాలు 

మొత్తం మృతుల సంఖ్య 

ఈ విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మృతిచెందినట్లు తాజా సమాచారం చెబుతోంది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (వయసు 68) కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన కుమార్తెను కలుసుకోవడానికి లండన్ వెళ్తుండగా ఈ విషాదకర ఘటన జరిగింది. ఈ ఘోర విషాద నేపథ్యంలో, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. వారు ప్రతి కుటుంబానికి రూ. 1 కోటి పరిహారాన్ని ప్రకటించారు.