Parliament: నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ చిత్రాలు మద్రించిన బ్యాగుతో.. పార్లమెంటుకు విపక్షాలు.. క్యూట్‌గా ఉందన్న రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలని విపక్షాలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు పార్లమెంటు ఆవరణలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం పార్లమెంటు లోని అవరణలో అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాస్కులను ధరించి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ నిర్వహించారు.
తాజాగా, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష నాయకులు మంగళవారం ఒక వినూత్నమైన బ్యాగ్ ధరించి పార్లమెంటు కు వచ్చారు.
ఈ బ్యాగ్‌కి ఒకవైపు ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ చిత్రాలు, మరోవైపు 'మోదీ, అదానీ భాయ్ భాయ్' అనే నినాదం ముద్రించబడ్డాయి.
వివరాలు
"చూడండి ఎంత క్యూట్‌గా ఉందో" : రాహుల్
ఈ నేపథ్యంలో, ప్రియాంక గాంధీ వద్ద ఉన్న బ్యాగును రాహుల్ గాంధీ పరిశీలించి, "చూడండి ఎంత క్యూట్‌గా ఉందో" అని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత, ఆ బ్యాగులు ధరించి వారు పార్లమెంటు వెలుపల నిరసన తెలుపుతూ, తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
సోమవారం కూడా పార్లమెంటు ముఖద్వారం వెలుపల ప్రధాని మోదీ, అదానీ ముఖాలను మాస్కులతో ధరిస్తూ, రాహుల్ గాంధీ వారిని వెళ్లి ప్రశ్నించారు.
ఈ చర్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.