Page Loader
Priyanka Gandhi: వయనాడ్లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ..
వయనాడ్లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ..

Priyanka Gandhi: వయనాడ్లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2024
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్‌కు ముందు, ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వయనాడ్‌లోని కల్పేటలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

వివరాలు 

వయనాడ్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా

రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ లోక్‌సభ స్థానాలలో గెలవడంతో, వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాతో, ప్రియాంక గాంధీ వయనాడ్ ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. యూడీఎఫ్ ప్రియాంకకు మద్దతు ఇస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ నవంబర్ 13న జరగనుంది, ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి. మరోవైపు, ఎల్డీఎఫ్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి సత్యన్ మొఖేరీ, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కూడా బరిలో నిలిచారు.