Page Loader
Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు
రైతులకు ఊరట.. కేరళకు తాకిన రుతుపవనాలు!

Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే భారత దేశాన్ని తాకాయి. కొద్దిసేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో విస్తృత వర్షపాతం మొదలైంది. ఈ ప్రకటనతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఇక రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇది 16 ఏళ్ల తర్వాత జరిగిన అరుదైన పరిణామం. 2009లో మే 23న కేరళలో రుతుపవనాలు ప్రవేశించగా, ఇప్పుడూ మే 23కే వర్షాలు మొదలవడం గమనార్హం. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళను తాకుతుంటాయి.

Details

మనంఅ

ఇక రుతుపవనాల అత్యంత ఆలస్య ప్రవేశం 1972లో జూన్ 18న నమోదైంది. 2016లో 25 ఏళ్లలో అత్యంత ఆలస్యంగా జూన్ 9న రుతుపవనాలు కేరళను తాకాయి. ఇప్పటికే రోహిణి కార్తె సమయం ప్రారంభమవుతున్నా, ఎండలు భగ్గుమనే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండే రోహిణి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. ఈ సారి ఆ ఉష్ణత తీవ్రత కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మే 29 వరకు కేరళతో పాటు తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాబోయే ఐదు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Details

ఎనిమిది రోజుల ముందుగానే ప్రారంభం

ఈసారి మాత్రం ఎనిమిది రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. ఐఎండీ ప్రకారం, 1918లో మే 11న రుతుపవనాలు తొలిసారిగా అత్యంత ముందుగా వచ్చాయి. ఇక రుతుపవనాల అత్యంత ఆలస్య ప్రవేశం 1972లో జూన్ 18న నమోదైంది. 2016లో 25 ఏళ్లలో అత్యంత ఆలస్యంగా జూన్ 9న రుతుపవనాలు కేరళను తాకాయి. ఇప్పటికే రోహిణి కార్తె సమయం ప్రారంభమవుతున్నా, ఎండలు భగ్గుమనే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండే రోహిణి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. ఈ సారి ఆ ఉష్ణత తీవ్రత కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Details

కర్ణాటక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మే 29 వరకు కేరళతో పాటు తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాబోయే ఐదు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.