Page Loader
PM Modi: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రధానిని కలవాలనుకునే మంత్రులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి 
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రధానిని కలవాలనుకునే మంత్రులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి

PM Modi: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రధానిని కలవాలనుకునే మంత్రులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కరోనా వైరస్‌ (కొవిడ్‌) వ్యాప్తి మళ్లీ వేగంగా పెరుగుతోంది. తాజాగా ఈ మహమ్మారి బారిన పడిన వ్యక్తుల సంఖ్య 7,000 మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా, ప్రధాని నరేంద్ర మోదీని కలిసే కేంద్ర మంత్రులు, అధికారులతో పాటు ఇతర ప్రముఖులు కూడా తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ (RT-PCR) పరీక్షలు చేయించుకోవాలంటూ ప్రధాని కార్యాలయం (PMO) సూచించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

వివరాలు 

నమోదైన మరణాల సంఖ్య 74

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 306 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,121కు చేరినట్టు వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 74కి పెరిగింది. రాష్ట్రాల వారీగా గణాంకాల పరిశీలనలో, కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,223 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. కొత్త కరోనా వేరియంట్లపై అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్ప,అతిగా భయాందోళనలు అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు.

వివరాలు 

రాష్ట్రాలవారీగా కొవిడ్‌ కేసుల వివరాలు: 

ప్రజలు కోవిడ్‌ సోకకుండా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. డేటాబోర్డు ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,121 యాక్టివ్‌ కేసుల్లో: కేరళ- 2,223, గుజరాత్ -1,223, దిల్లీ- 757, పశ్చిమ బెంగాల్- 747, మహారాష్ట్ర- 615, కర్ణాటక- 459, ఉత్తరప్రదేశ్‌- 229, తమిళనాడు- 204 రాజస్థాన్‌-138, హరియాణా- 125, ఆంధ్రప్రదేశ్‌-72, మధ్యప్రదేశ్‌-65, ఛత్తీస్‌గఢ్‌- 48, బిహార్‌-47, ఒడిశా- 41, సిక్కిం,పంజాబ్-తలా 33, తెలంగాణ- 11, పుదుచ్చేరి, ఝార్ఖండ్‌ - తలా 10, జమ్మూ కశ్మీర్‌ - 9, అస్సాం, గోవా - తలా 6, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌ - తలా 3, హిమాచల్‌ ప్రదేశ్‌ - 2, మణిపూర్‌, త్రిపుర - తలా ఒక్కో కేసు