Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ దేశాల్లో కలకలం రేపిన ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసుల సంఖ్య భారత్‌లో మూడుకు చేరింది.
కేరళలో తాజాగా నమోదైన మరో మంకీ పాక్స్ కేసు గురించి ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
అతని నమూనాలను పరీక్షలకు పంపించగా, అది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు వెల్లడించారు.
వివరాలు
122 దేశాలలో 99,518మంకీ పాక్స్ కేసులు
భారత్‌లో సెప్టెంబర్ 9న మొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది, ఇది విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలలో పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న క్లేడ్-2 రకంగా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత, సెప్టెంబర్ 18న కేరళ ఆరోగ్యశాఖ 38 సంవత్సరాల యువకుడికి మంకీపాక్స్ నిర్ధారణ జరిగిందని తెలిపింది, అతను యూఏఈ నుండి కేరళకు వచ్చాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ప్రకారం,122 దేశాలలో 99,518మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.
ఈ పరిస్థితి ప్రపంచదేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది.ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆఫ్రికాలో ఈ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
వివరాలు
మంకీపాక్స్ లక్షణాలు
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు ఇవి లక్షణాలలో ఉన్నాయి.
కళ్లు, నోరు, మల, మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి.
మొదట నీటి బొడిపెలుగా కనిపించి, తరువాత ఎరుపు, నలుపు రంగులలోకి మారుతాయి.
జబ్బు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉండడం, వారి వస్తువులను ముట్టుకోవడం లేదా ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.