Page Loader
Security Drills: 31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్‌
31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్‌

Security Drills: 31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 31వ తేదీన సాయంత్రం,పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన జిల్లాల్లో భద్రతా బలగాలు ప్రత్యేక భద్రతా అభ్యాసాలు(సెక్యూరిటీ డ్రిల్స్‌)నిర్వహించనున్నాయి. ఈ కవాతులు గుజరాత్‌,పంజాబ్‌,హర్యానా, రాజస్థాన్‌,జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో జరగనున్నాయి. సరిహద్దు అవతల నుంచే ముప్పు ఏర్పడే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని,అక్కడి ప్రజలకు తగిన అవగాహన కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితులపట్ల స్థానికుల సహకారాన్ని పెంచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ప్రధమంగా ఈ భద్రతా వ్యాయామాలు గురువారం రోజున నిర్వహించాలనుకొన్నారు. అయితే పరిపాలన సంబంధిత కొన్ని కారణాల వల్ల ఈ డ్రిల్స్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. పాకిస్థాన్‌ వైపు నుండి ఇటీవల నాలుగు రోజులపాటు తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, 'ఆపరేషన్ షీల్డ్‌'లో భాగంగా ఈ ప్రత్యేక డ్రిల్స్‌ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్‌