
Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పాక్‌పై ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య చర్యలు ముమ్మరం చేసింది. ఈ చర్యల భాగంగా పాక్ కుట్రలను వివరిస్తూ, ప్రపంచ దేశాలను చైతన్య పరచే లక్ష్యంతో కేంద్రం ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు విదేశాల్లో పర్యటించి పాక్ చర్యలవల్ల ఏర్పడే గండాలను వివరించనున్నాయి. ఈ ఏడుగురు బృందాలకు నేతృత్వం వహించేందుకు ఎంపీల పేర్లను కేంద్రం శనివారం ప్రకటించింది. కాంగ్రెస్ నేత శశి థరూర్, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ జయంత్ పాండా, జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా, డీఎంకేకు చెందిన కనిమొళి, ఎన్సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ప్రతినిధులుగా నియమించబడ్డారు.
Details
మే 22న విదేశాలకు పయనం
ప్రతినిధుల బృందాలు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి వస్తాయని కేంద్రం తెలిపింది. పాక్‌కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై విపక్షాలతో సమన్వయం చేసి ఈ ఎంపీలను ఎంపిక చేశారు. ఈ బృందాలు ఐదు ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్నాయి 1. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి దారితీసిన పాక్ రెచ్చగొట్టే చర్యలు. 2. భారత్ పాక్ బెదిరింపులకు ధీటుగా ఎలా స్పందించిందో వివరించడం. 3. భవిష్యత్తులో ఉగ్రదాడులకు భారత్ ఇచ్చే ప్రతిస్పందనపై స్పష్టత. 4. పౌరులకు హానీ లేకుండా ఉగ్రస్థావరాలపై మాత్రమే దాడులు జరిపినట్లు స్పష్టత ఇవ్వడం. 5. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును, దాని ప్రపంచ ప్రభావాలను వివరించడం.
Details
మద్దతును కూడగట్టేందుకు కృషి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఇప్పటికే పలు దౌత్య చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సింధూ జలాల ఒప్పందం రద్దు, పాక్ పౌరులను వెనక్కి పంపడం, వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం, అనంతరం "ఆపరేషన్ సిందూర్" ద్వారా ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టడం ఉన్నాయి. ఈ చర్యలన్నింటిపై విదేశీ నేతలకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ప్రతినిధుల బృందాలు అదే అంశాలను మరింత లోతుగా వివరిస్తూ, ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకు కృషి చేయనున్నాయి.