Page Loader
Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ 
కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ

Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2024
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్‌ మండికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దేశంలో రైతుల ఉద్యమంపై వివాదాస్పద ప్రకటన చేశారు. ఆమె ప్రకటనపై విపక్షాలు బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాయి. రనౌత్‌పై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఈ విషయంలో బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసి రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విధానపరమైన అంశాలపై ప్రకటనలు ఇచ్చే అధికారం రనౌత్‌కు లేదని బీజేపీ స్పష్టం చేసింది.

వివరాలు 

బీజేపీ విడుదల చేసిన  ప్రకటన ఏంటి? 

బీజేపీ లిఖితపూర్వకంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో, 'రైతుల ఉద్యమ సందర్భంలో కంగనా రనౌత్ ఇచ్చిన ప్రకటన పార్టీ అభిప్రాయం కాదు. రనౌత్ ప్రకటనపై బీజేపీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. రనౌత్‌కు పార్టీ విధాన సమస్యలపై మాట్లాడటానికి ఆమెకి అనుమతి లేదు లేదా ప్రకటనలు చేయడానికి ఆమెకు అధికారం లేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయవద్దని బీజేపీ రనౌత్‌ను ఆదేశించింది.

వివరాలు 

రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? 

3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సందర్భంగా మృతదేహాలు ఉరివేసుకున్నట్లు కనిపించాయని, అత్యాచారాలు జరుగుతున్నాయని రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిరసనలు కొనసాగడానికి స్వార్థ ప్రయోజనాలు, విదేశీ శక్తులే కారణమని, అగ్రనాయకత్వం బలంగా లేకుంటే రైతుల ఉద్యమ సమయంలో పంజాబ్, బంగ్లాదేశ్‌గా మారిపోయి ఉండేదని అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు బీజేపీపై విరుచుకుపడ్డాయి.