NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
    భారతదేశం

    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

    వ్రాసిన వారు Naveen Stalin
    May 04, 2023 | 07:18 pm 1 నిమి చదవండి
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

    మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు, రక్తపాతాలు జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తేచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఇంఫాల్ లోయలోని మైతైలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కుకీ తెగల మధ్య ఘర్షణ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. అయితే ఈ రెండు వర్గాల మధ్య హింసకు 1970లోనే బిజం పడింది. మణిపూర్‌లో బుధవారం నాటి హింసతో ప్రభావిత జిల్లాల్లో సైన్యం, అస్సాం రైఫిల్ సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను రాబోయే ఐదు రోజుల పాటు నిలిపివేసింది.

    మణిపూర్‌ భౌగోళిక సర్వూరం 

    మణిపూర్‌లో 16 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర భూభాగాన్ని ఇంఫాల్ లోయ, కొండ జిల్లాలుగా విభజించారు. ఇంఫాల్ లోయలో ఐదు జిల్లాలు ఉన్నాయి. ఇందులో హిందువులు, మైతైల ఆధిపత్యం ఉంటుంది. కొండ జిల్లాలలో నాగా, కుకి తెగల ఆధిపత్యం ఉంటుంది. తాజాగా అత్యధిక హింసకు గురైన చురచంద్‌పూర్ కొండ జిల్లాల్లో ఒకటి. ఇక్కడ కుకీలు లేదా నాగ క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. నాలుగు కొండ జిల్లాల్లో కుకీల మెజార్టీ సంఖ్యలో ఉంటారు. రాష్ట్ర మొత్తం జనాభాలో 53శాతం మంది మైతైలు ఉన్నారు. అయితే రాష్ట్రంలో వారి ఆధీనంలో కేవలం 10శాతం భూమి ఉంటడంపై కొన్నేళ్లుగా మైతైలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ 35 తెగలు ఉండగా, వాటిలో మెజార్టీ వాటా కుకీలదే కావడం గమనార్హం.

    తాజా హింసకు కారణం ఇదే

    షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలన్న మైతై కమ్యూనిటీ అభ్యర్థనను నాలుగు వారాల్లోగా పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ఏప్రిల్ 20న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సిఫార్సును కేంద్రం పరిశీలనకు పంపాలని కోర్టు కోరింది. మైతై కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చడాన్ని నిరసిస్తూ కుకీ తెగకు చెందిన సంస్థలు బుధవారం 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించాయి. ఈ యాత్ర తర్వాతే హింస చెలరేగింది. అభివృద్ధి చెందిన మైతైలు ఎస్టీ హోదా ఎలా పొందుతారని గిరిజన నాయకులు ప్రశ్నిస్తున్నారు. వారికి ఎస్టీ హోదా వస్తే తమ భూమి అంతా తీసుకుంటారని ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కెల్విన్ నెహ్సియాల్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మైతై వర్గం ఏం చెప్పిందంటే?

    మణిపూర్‌లో చెలరేగిన హింసపై మైతై వర్గం కూడా తమ వాదనను వినిపించింది. కుకీ తెగ చేస్తున్న నిరసనలు ఎస్టీ హోదాకు వ్యతిరేకంగా కాదని మైతై వర్గం నాయకులు అంటున్నారు. ఎస్టీ హోదా ముసుగులో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియకు అడ్డం పడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మణిపూర్ అంతటా అక్రమ వలసదారులను గుర్తించే డ్రైవ్ కొనసాగుతోందని ఆల్ మైతై కౌన్సిల్ సభ్యుడు చాంద్ మీటే పోచ్‌షాంగ్‌బామ్ అన్నారు. ఇది కుకీలకను కలవరపాటు గురి చేస్తోందని ఆయన చెప్పారు.

    ఒక్కసారిగా పెరిగిన జనాభా, ఎన్‌ఆర్‌సీకి డిమాండ్

    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 1951ని బేస్ ఇయర్‌గా పరిగణించి ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలని ఈ ఏడాది మార్చిలో పలు మణిపురి సంస్థలు నిరసనకు దిగాయి. జనాభా పెరుగుదలలో జాతీయ సగటు 17.64 శాతానికి కంటే మణిపూర్‌లో అత్యధికంగా 24.5 శాతం వృద్ధి రేటు ఉండటంపై మైతై యూనియన్లతో పాటు మరికొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. జనాభా వృద్ధి రేటు పెరుగుదల సహజంగా జరగలేదని, పొరుగు దేశాల నుంచి వచ్చిన వలసల వల్లే ఈ స్థాయిలో జనాభా పెరిగినట్లు ఆయా సంస్థలు అనుమానిస్తున్నాయి. కుకీలు మయన్మార్ సరిహద్దు నుంచి అక్రమంగా వలస వచ్చి మణిపూర్‌లోని అటవీ భూమిని ఆక్రమిస్తున్నారని ఆల్ మెయిటీ కౌన్సిల్‌కు చెందిన చాంద్ మీటే పోక్‌షాంగ్‌బామోఫ్ చెప్పారు.

    1970 నుంచి మయన్మార్ నుంచి పెరిగిన వలసలు

    మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా అకస్మాత్తుగా జనాభా పెరుగుదల నమోదైనట్లు మైతై వర్గం చెబుతోంది. ముఖ్యంగా మయన్మార్ నుంచి అక్రమ వలసదారులు 1970ల నుంచి రావడం ప్రారంభించారు. వచ్చిన వారు మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో స్థరపడుతూ వచ్చారు. మణిపూర్ ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ నివాసాలను తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టినట్లు ఆల్ మైతై కౌన్సిల్‌కు చెందిన చాంద్ మీటే పోక్‌షాంగ్‌బామోఫ్ అన్నారు. ఈ డ్రైన్ కేవలం కుకీలు నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే జరగడం లేదని, మైతైలు, ముస్లింలు నివసించే చోట్ల కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరి కుకీలు మాత్రమే ఎందుకు నిరసన తెలుపుతున్నారని ప్రశ్నించారు.

    నా రాష్ట్రాన్ని ఆదుకోండి: మోదీని కోరిన మేరీ కోమ్

    My state Manipur is burning, kindly help @narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh @republic @ndtv @IndiaToday pic.twitter.com/VMdmYMoKqP

    — M C Mary Kom OLY (@MangteC) May 3, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మణిపూర్
    ఇంఫాల్
    తాజా వార్తలు
    ఆర్మీ

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మణిపూర్‌ కిరాణా షాపులో లైంగిక వేధింపులు..సరుకులు కొంటున్న యువతిని వేధించిన జ‌వాన్‌ స‌స్పెండ్ జవాన్
    రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన  ముఖ్యమంత్రి

    ఇంఫాల్

    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు మణిపూర్
    మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్  మణిపూర్
    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం అస్సాం/అసోం
    మణిపూర్‌లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు మణిపూర్

    తాజా వార్తలు

    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్ సోషల్ మీడియా
    దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన సుప్రీంకోర్టు
    కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!  ప్రిన్స్ హ్యారీ
    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  అమెరికా

    ఆర్మీ

    అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు అమెరికా
    ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ  జమ్ముకశ్మీర్
    ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి  జమ్ముకశ్మీర్
    సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం  జమ్ముకశ్మీర్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023