
Special Trains : దసరా, దీపావళి రద్దీకి దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే దసరా, దీపావళి పండుగల సందర్భంగా పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. దసరా, దీపావళి, ఛత్ పండుగల కోసం మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు నడుస్తాయని ఆయన తెలిపారు.
Details
ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-తిరుపతి రూట్ సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు సికింద్రాబాద్ -తిరుపతి మధ్య 4 ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు తిరుపతి -సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు కాచిగూడ - నాగర్‌సోల్ రూట్ సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు కాచిగూడ -నాగర్‌సోల్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు నాగర్‌సోల్ - కాచిగూడ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు సంత్రాగ్జి-చర్లపల్లి రూట్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు సంత్రాగ్జి - చర్లపల్లి మధ్య 3 ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు చర్లపల్లి - సంత్రాగ్జి మధ్య 3 ప్రత్యేక సర్వీసులు