Page Loader
Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు కొత్త జడ్జీలు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..
సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..

Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు కొత్త జడ్జీలు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే కొంతమంది కొత్త జడ్జీలు నియమితులు కావడానికి మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల స్థానాలకు గాను సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా సిఫార్సులు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తుహిన్ కుమార్ గేదెలను సిఫారసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదెలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నిర్ణయం జూలై 2న జరిగిన కొలీజియం సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ , న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ హాజరయ్యారు. జూలై 1 నాటికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 37 న్యాయమూర్తుల పదవులు ఉండాలి.

వివరాలు 

తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయవాదుల నియామకానికి సిఫారసు 

అయితే 9 స్థానాలు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం కేవలం 28 మంది న్యాయమూర్తులతోనే హైకోర్టు పనిచేస్తోంది. ఇక తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. గాడి ప్రవీణ్ కుమార్, గౌస్ మీరా మోహియుద్దీన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 42 న్యాయమూర్తుల స్థానాలు ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కేవలం 26 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో న్యాయ ప్రక్రియపై భారం పడుతున్న నేపథ్యంలో, నాలుగు ఖాళీలను నింపేందుకు ఈ సిఫారసులు చేసింది కొలీజియం.