LOADING...
Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావాను డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు 
రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావాను డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావాను డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)పై బీజేపీ (BJP) దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్‌ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని రేవంత్‌ ప్రచారం చేస్తారని బీజేపీ పేర్కొని కేసు పెట్టింది. ఇదే పిటిషన్‌ను గత నెల హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. సుప్రీంకోర్టులో వాదనలు వినిన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం, రాజకీయపరమైన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు సున్నితమైన మనసుతో ఉండాల్సిన అవసరం ఉందని, కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చరాదు అని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు.