LOADING...
Ram Setu: 'రామ సేతు'ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని పిటిషన్‌.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

Ram Setu: 'రామ సేతు'ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని పిటిషన్‌.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌లో పేర్కొన్నట్టుగా, రామసేతుకు తగిన సమయంలో జాతీయ స్మారక చిహ్న హోదా ఇవ్వాలని, అలాగే జియోలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సమగ్ర సర్వే జరిపించాలని సూచించారు. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా విచారిస్తున్నారు. సుబ్రమణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది విభా మఖిజా వాదనలు వినిపించారు.

వివరాలు 

'సేతు సముద్రం షిప్‌ ఛానెల్‌ ప్రాజెక్ట్' కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించండి

సుబ్రమణ్య స్వామి తన పిటిషన్‌లో రామసేతును కాలుష్యం నుండి రక్షించడం,దాని పవిత్రతను నిలుపుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతలో ఉందని స్పష్టం చేశారు. రామసేతు ప్రదేశం అనేకమంది భక్తుల నమ్మకాలతో సంబంధమై ఉన్నందున, దాని పరిరక్షణ అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. అలాగే, 'సేతు సముద్రం షిప్‌ ఛానెల్‌ ప్రాజెక్ట్' కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించి, రామసేతుపై ప్రభావం పడకుండా చేయాలని సుబ్రమణ్య స్వామి మరో పిటిషన్‌లో సూచించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టు అమలు అయితే, మన్నార్‌, పాక్‌ జలసంధిను కలుపుతూ 83 కి.మీ మేర పూడిక తీసి ఛానెల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది రామసేతుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

సుప్రీంకోర్టులో గతంలోనే ఓ పిల్‌ దాఖలు చేసిన సుబ్రమణ్య స్వామి

రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్‌లో కోరారు. అయితే, స్మారక చిహ్నంగా ప్రకటించాలా, లేదా అనే నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలు నాన్చుతోందని ఆయన తన పిటిషన్‌లో ఆక్షేపించారు. దీనిని పరిశీలించినప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.