Page Loader
Tamil Nadu: శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఐదుగురు మృతి, అనేక మందికి గాయాలు 
శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఐదుగురు మృతి, అనేక మందికి గాయాలు

Tamil Nadu: శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఐదుగురు మృతి, అనేక మందికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో జరిగిన భయానక ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, తమిళనాడులో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శివకాశిలో ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైనవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.పేలుడు అనంతరం ఘటనా స్థలాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

వివరాలు 

రసాయన కర్మాగారంలో భారీ పేలుడు

ఇక మంగళవారం జరిగిన తెలంగాణ ప్రమాదం సంగతి చూస్తే, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలం పాషామైలారం పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర రసాయన ప్రమాదం సంభవించింది. సిగాచి ఇండస్ట్రీస్‌కు చెందిన రసాయన కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ భయానక ఘటనలో ఇప్పటి వరకు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతలా మారిపోయాయి. ఈ విషాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు