LOADING...
Tejashwi Yadav: పాట్నాలో నడిరోడ్డుపై యువ కళాకారులతో కలిసి నృత్యం చేసిన తేజస్వి యాదవ్.. వీడియో వైరల్ 
నడిరోడ్డుపై యువ కళాకారులతో కలిసి నృత్యం చేసిన తేజస్వి యాదవ్.. వీడియో వైరల్

Tejashwi Yadav: పాట్నాలో నడిరోడ్డుపై యువ కళాకారులతో కలిసి నృత్యం చేసిన తేజస్వి యాదవ్.. వీడియో వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం సన్నద్ధతతో ముందడుగు వేస్తుంది. అదే సమయంలో, రాహుల్ గాంధీ సమక్షంలో ఓటర్ అధికార్ యాత్ర జరిగింది,దీనికి రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ యాత్రలో ఇండియా కూటమి పార్టీల ప్రధాన నేతలు అందరూ హాజరయ్యారని తెలిపారు.

వివరాలు 

 హృతిక్ రోషన్ సిగ్నేచర్ స్టెప్స్‌లో  తేజస్వి యాదవ్ 

ఓటర్ అధికారం యాత్ర పూర్తయిన తర్వాత, తేజస్వి యాదవ్ తన మేనల్లుడితో కలిసి కొన్ని వినోద కార్యకలాపాల కోసం షికారుకు వెళ్లారు. అదేవిధంగా, ఇటీవల పాట్నాలో ప్రారంభమైన మెరైన్ డ్రైవ్ ఎక్స్‌ప్రెస్‌వేను సందర్శించారు. అక్కడికొచ్చిన కొంతమంది సోషల్ మీడియా కంటెంట్ర్స్, కళాకారులు డ్యాన్స్ చేస్తూ వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. వారిని చూసి తేజస్వి యాదవ్ కూడా వారితో కలిసి స్టెప్స్ చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సిగ్నేచర్ స్టెప్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను తేజస్వి సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వివరాలు 

కొత్త బీహార్‌ను సృష్టించడానికి అధికారంలో మార్పు అవసరం: తేజస్వి యాదవ్

అదేవిధంగా, తేజస్వి యాదవ్ కొంతమంది యువతీయువకులను కూడా కలిశారు. ఒక సామాన్య పౌరుడి లా వారితో సంభాషించి, చాయ్ తాగుతూ మిత్రత్వాన్ని పెంపొందించారు. ఈ సందర్శనలో జరిగిన దృశ్యాలను తేజస్వి యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తన మేనల్లుడు సింగపూర్ నుంచి వచ్చాక డ్రైవ్ కోసం వెళ్దామని, యువతీయువకులతో కలిసి పాటలు పాడుతూ, రీల్స్ రూపొందిస్తున్న దృశ్యాలను తనకూ అనుభవమైందని తెలిపారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, కులం, మతానికి మించి యువత అంచనాలు, ఆకాంక్షలు, కలలు, ఆశలతో ముందుకు అడుగులు వేస్తారని చెప్పారు. అలాగే, కొత్త బీహార్‌ను సృష్టించడానికి అధికారంలో మార్పు అవసరం ఉందని, ఆ మార్పు యువతకు కొత్త అవకాశాలు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రోహిణి ఆచార్య చేసిన ట్వీట్