LOADING...
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ స్వచ్ఛథాన్‌ అంబాసిడర్‌గా  తెలంగాణా వాసి ఎంపిక
ఆంధ్రప్రదేశ్‌ స్వచ్ఛథాన్‌ అంబాసిడర్‌గా తెలంగాణా వాసి ఎంపిక

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ స్వచ్ఛథాన్‌ అంబాసిడర్‌గా  తెలంగాణా వాసి ఎంపిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ వాసి గుగ్గిలం అశోక్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వచ్ఛథాన్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ స్వచ్ఛథాన్‌ (మారథాన్‌ రన్నింగ్‌)కార్యక్రమం అమరావతిలో అక్టోబరు 2న ఘనంగా నిర్వహించబడనుంది. కామారెడ్డి జిల్లా రవాణాశాఖలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక్‌ ఈ ప్రత్యేక బాధ్యతను చేపట్టనున్నారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ గ్రామానికి చెందిన అశోక్‌ ఇప్పటికే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో అనేక మారథాన్‌ రేసులలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. ఫుల్‌ మారథాన్‌ (42 కి.మీ)లో ఎనిమిది సార్లు,హాఫ్‌ మారథాన్‌ (21 కి.మీ)లో 28 సార్లు పాల్గొన్నారు. ఈ విస్తృత అనుభవం, విజయాలు చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనను స్వచ్ఛథాన్‌ అంబాసిడర్‌గా నామినేట్ చేసింది.