Page Loader
Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై 
యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై

Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 23, 2024
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్‌(Mount Elbrus) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు యువతి అధిరోహించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అన్నపూర్ణ, సోమవారం రష్యాలో ఉన్న యూరప్‌లోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించింది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిలోని కొత్తూరు వైఎస్సార్‌ సెంటర్‌లో నివాసముంటూ ఉద్యోగ రీత్యా సౌదీ అరేబియాలో ఉంటున్న కొండపు మహేష్‌రెడ్డి భార్య కొండపు అన్నపూర్ణ ఆగష్టు 19వ తేదీన ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించి భారత జాతీయ జెండాను ఎగురవేసింది. 14వ తేదీ మొదటి క్యాంప్‌ ట్రెక్సాల్‌ 2000 మీటర్లు, రెండవ క్యాంప్‌లో 3857 మీటర్లు, 16,17,18,19 తేదీలలో 4,200 మీటర్లు, 19వ తేదీ ఉదయం 7.54లకు మొత్తం 5,642 మీటర్లు(18510 అడుగుల ఎత్తు) పర్వతాన్ని అధిరోహించారు.

వివరాలు 

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అన్నపూర్ణ

అన్నపూర్ణ తండ్రి బండారు శ్రీరామచంద్రరావు(లేటు),తల్లి వెంకటేశ్వరమ్మ ప్రోత్సాహంతో ఎంఎస్‌సీ(బయోటెక్‌),B.ed పూర్తి చేసి ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.