Page Loader
Telangana TGSRTC:తెలంగాణలో పల్లెవెలుగుతో సహా అన్ని బస్సులలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ 
తెలంగాణలో పల్లెవెలుగుతో సహా అన్ని బస్సులలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ

Telangana TGSRTC:తెలంగాణలో పల్లెవెలుగుతో సహా అన్ని బస్సులలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2024
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఆర్టీసీ కొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. టికెట్‌లు, బస్‌పాస్‌లు అన్నీ ఆన్‌లైన్ విధానంలోకి మార్చే ప్రణాళికలు చేపట్టింది. ఈ డిజిటల్ పేమెంట్ విధానం ద్వారా చిన్న చిల్లర సమస్యలను తగ్గించడంతోపాటు ఇతర సమస్యలకు పరిష్కార మార్గాలు అందించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెండు డిపోల పరిధిలో ఈ విధానం అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్‌లలో ఈ విధానాన్ని విస్తరించాలని నిర్ణయించారు .

వివరాలు 

డిజిటల్ ఆర్టీసీ 

తెలంగాణ ఆర్టీసీ బస్‌లలో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. "ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్" (APFCS) పేరిట రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అన్ని బస్‌లలో అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్‌ను కూడా ఆర్డర్ చేస్తున్నారు. 13,000 ఐటెమ్‌లను కొనుగోలు చేసి 9,000 బస్‌లలో అందుబాటులో ఉంచుతారు, మిగిలిన వాటిని బఫర్ స్టాక్‌గా ఉంచుతారు, \ఏదైనా మెషిన్ పాడైతే, వాటి స్థానంలో వేరే మెషిన్‌ను ఉపయోగిస్తారు.

వివరాలు 

ప్రక్రియ ఆలస్యం 

ప్రస్తుతం, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల బస్సుల్లో మాత్రమే డిజిటల్ పేమెంట్ విధానం అమలవుతోంది. మొత్తం హైదరాబాద్‌లో అన్ని బస్‌లలో దీన్ని అమలు చేయాలని చూస్తున్నా, ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఒక్క హైదరాబాద్‌కే కాకుండా పల్లెవెలుగు వంటి బస్‌లలో కూడా ఈ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. అందుకే అమలవుతున్న ప్రక్రియ ఆలస్యం అవుతోంది. కొన్ని బస్‌లలో అమలు ఇంద్ర, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్‌లలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. పల్లెవెలుగు వంటి బస్‌లలో కూడా దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు, అందుకే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. సాఫ్ట్‌వేర్ ,ఆర్డర్ చేసిన ఐటెమ్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత, పూర్తిస్థాయిలో డిజిటల్ పేమెంట్స్ అమలవుతాయి.

వివరాలు 

డిజిటల్ బస్‌ పాస్‌లు 

బస్‌ పాస్‌లను కూడా డిజిటల్ విధానంలోకి మార్చాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించుకుంది. వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీ పాస్‌లు, రెగ్యులర్ పాస్‌లను డిజిటల్ విధానంలో అందించనున్నారు. ఈ పాస్‌లకు డిజిటల్ కార్డులు ఇస్తారు, వాటిని బస్ ఎక్కిన తర్వాత స్వైప్ చేయాల్సి ఉంటుంది. డేటా ఇంటిగ్రేషన్ డిజిటల్ విధానంలో పాస్‌లు పొందిన వారు, టికెట్ కొనుగోలుదారులు, డిజిటల్ పేమెంట్స్ చేసిన వారు ఎంతమంది ఉన్నారో ఒకే చోట తెలుసుకోవచ్చు. ఏ రూట్‌లలో ఏ సమయాన ఎంత మంది ప్రయాణిస్తున్నారో తెలుసుకుని, ఆ రూట్‌లో సర్దుబాటు చేయడానికి వీలుంటుంది. రద్దీ లేని ప్రాంతాల్లో బస్‌ల సంఖ్యను తగ్గించి, రద్దీ ఉన్న ప్రాంతాలకు బస్‌లను తరలించే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు.