Rahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సావర్కార్ సిద్ధాంతంపై విమర్శలు గుప్పిస్తూ, సావర్కార్ గురించి మాట్లాడితే ఈ బీజేపీ తనను దోషిగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపంగా ఉందని, దేశంలోని ప్రజలు వివిధ సిద్ధాంతాలను పాటిస్తారని ఆయన చెప్పారు. వివిధ ఆలోచనా విధానాలకు విలువ ఉండాలని, అందుకే రాజ్యాంగం కూడా వివిధ దృక్పథాలకు అనుకూలంగా ఉండటం అవసరమని వెల్లడించారు. రాహుల్ గాంధీ, లోక్‌సభలో మహాభారతంలో కుల వివక్ష అంశాన్ని ప్రస్తావించారు.
బీజేపీ ప్రభుత్వం దేశాన్నినాశనం చేస్తోంది
ఏకలవ్యుడు శిక్షణ కోసం ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు 'నువ్వు మా జాతివాడివి కాదని' ఆయనను వెనక్కి పంపడం జరిగినట్లు తెలిపారు. కానీ తఏకలవ్వుడు ద్రోణాచార్యుడి ప్రతిరూపంగా విద్య నేర్చుకున్నాడని చెప్పారు. అయితే ద్రోణాచార్యుడు గురు దక్షిణగా ఏకలవ్వుడి బొటన వేలు అడిగిన విషయంలో, కుల వివక్షను ప్రదర్శించాడని ఆయన విమర్శించారు. ద్రోణాచార్యుడి బొటన వేలు కట్ చేయడమే, బీజేపీ ప్రభుత్వం కూడా దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. ద్రోణాచార్యుడు ఏకలవ్వుడి బొటన వేలు ఎలా నరికాడో, ఇప్పుడు అదే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం కూడా దేశాన్ని నాశనం చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఆదానీకే అన్ని ప్రాజెక్టులు
భారతదేశంలోని యువతను, బొటన వేలులా మోడీ సర్కార్ నరికేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇవాళ అదానీకి అన్ని ప్రాజెక్టులు అప్పగించడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కనుమరుగవుతున్నాయని ఆయన చెప్పారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, డిఫెన్స్ రంగాలు మొత్తం అదానీకి అప్పగించడం మోడీ సర్కార్ తీసుకున్న తప్పు చర్యలలో ఒకటని చెప్పారు.