NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    సిద్దిపేట ప్రజల దశాబ్ద కల సాకారం.. రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

    సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 03, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

    సిద్దిపేట ప్రాంత ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన రైలు సర్వీస్ ఎట్టకేలకు ప్రారంభమైంది.

    ఈ రైల్వే లైన్‌ను నిజామాబాద్ నుంచి పర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు.

    కేవలం రూ.60తో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రైలు ప్రయాణం చేసే సదావకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోనున్నారు.

    నిన్నటిదాకా రైలు ఎక్కాలంటే సికింద్రాబాద్, కాజీపేట, కరీంనగర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై సిద్దిపేటలోనే రైలెక్కి ప్రయాణించవచ్చు.

    Details

    నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వే స్టేషన్లు

    సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజమాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద ఈ లైన్ కలుస్తుంది.

    ఈ రైల్వేలైన్‌ నిర్మాణం మెదక్‌ జిల్లాలో 9.30 కి.మీ., సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ., రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్‌ జిల్లాలో 20.86 కిలోమీటర్లు ఉండనుంది.

    ఈ నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.

    నేడు మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేసుకొని మంగళవారం తొలి రైలు పట్టాలెక్కింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    నిజామాబాద్
    రైల్వే స్టేషన్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నరేంద్ర మోదీ

    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ  సౌదీ అరేబియా
    రష్యా వాహన తయారీదారులకు పుతిన్ మేక్ ఇన్ ఇండియా ఉదాహరణ వ్లాదిమిర్ పుతిన్
    జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్  జీ20 సదస్సు
    మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ బీజేపీ

    నిజామాబాద్

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి హైదరాబాద్
    నిజామాబాద్‌: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ  ఎన్ఐఏ

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025