Page Loader
Rahul Gandhi :తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ పతనం ఖాయం : రాహుల్ గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ పతనం ఖాయం : రాహుల్ గాంధీ

Rahul Gandhi :తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ పతనం ఖాయం : రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2023
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జాగిత్యాలలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పున:ప్రారంభించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని, ప్రమానుబంధమని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నెహ్రూ, ఇందిరమ్మ నుంచి ఈ అభిమానం కొనసాగుతోందని బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Details

ప్రజల హృదయాల్లోంచి బయటికి పంపలేరు : రాహుల్ గాంధీ

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, వీరి మధ్య చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాను బీజేపీపై పోరాటం చేస్తుంటే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. సహజంగా అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తే, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం చాలా పులులు కలిసికట్టుగా బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాయనీ, తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్ అని కితాబిచ్చారు. తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, తనని ఇంటి నుంచి బయటికి పంపించారని పేర్కొన్నారు. తనని ఇంటి నుంచి బయటికి పంపించగలరేమో కాని, ప్రజల హృదయాల్లోంచి కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే బీసీ కులగణను చేపడుతామని చెప్పారు.