Page Loader
పశ్చిమ బెంగాల్: బంకురాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీ

పశ్చిమ బెంగాల్: బంకురాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీ

వ్రాసిన వారు Stalin
Jun 25, 2023
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ బంకురాలోని ఓండా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దీంతో ఖరగ్‌పూర్-బంకురా-ఆద్రా మార్గంలో రైల్వే సేవలు నిలిచిపోయాయి. రెండు రైళ్లు ఎలా ఢీకొన్నాయి అనేది విచారణ తర్వాతే తేలనుందని సేఫ్టీ అధికారులు తెలిపారు. రెండు రైళ్లు ఢీకొన్న నేపథ్యంలో వ్యాగన్లు, ఇంజన్ పట్టాలు తప్పాయి. ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీ కొని 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,000మంది గాయపడ్డారు. అంతకుముందు, జూన్ 5న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో రైల్వే క్రాసింగ్ వద్ద క్యారియర్ వాహనాన్ని రైలు ఢీకొట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రైలు ప్రమాద దృశ్యాలు