Page Loader
Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మూడు కీలక అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీం కోర్టు
వివేకా హత్య కేసు.. మూడు కీలక అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీం కోర్టు

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మూడు కీలక అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీం కోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా మూడు ముఖ్యమైన అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాతే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణ కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తున్నదా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా సీబీఐ అభిప్రాయం ఏమిటో తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

వివరాలు 

వైఎస్ సునీత, సీబీఐ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు

కేసు ట్రయల్‌తో పాటు తదుపరి దర్యాప్తును ఒకేసారి కొనసాగించే అవకాశం ఉందా? అనే విషయాన్ని సీబీఐ అభిప్రాయంతో తెలియజేయాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల బెయిల్ రద్దు చేయాలని వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత, సీబీఐ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఆ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐతో పాటు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.