NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి
    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి
    భారతదేశం

    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి

    వ్రాసిన వారు Naveen Stalin
    May 09, 2023 | 06:37 pm 1 నిమి చదవండి
    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి
    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి

    విశాఖపట్టణంకు దశాబ్దాల చరిత్ర ఉంటుంది. ఈ చరిత్రను తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కళింగ సామ్రాజ్యంలో భాగమైన విశాఖ గురించి క్రీస్తుపూర్వం 5, 6వ శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాల్లో చెప్పబడింది. అంతటి గొప్ప ప్రాంతమైన వైజాగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విశాఖతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు 500 బీసీ నుంచి 260 బీసీ మధ్య కాలంలో కళింగ సామ్రాజ్యంతో భాగంగా ఉండేవి. క్రీస్తుపూర్వం 5, 6వ శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాల్లో విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

    మౌర్య సామ్రాజ్యంలో విలసిల్లిన బౌద్ధం 

    కళింగ సామ్రాజ్యం పతనం తర్వాత విశాఖ 260బీసీ నుంచి 230బీసీ మధ్య కాలంలో మౌర్యుల పాలనలో ఉండేది. అశోకుడు కళింగ రాజులను ఓడించిన తర్వాత మౌర్య సామ్రాజ్యంలో రారాజుగా వెలిగాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అశోకుడు బౌద్ధం మతం స్వీకరించాడు. దీంతో విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో బౌద్ధం విలసిల్లింది. ఈ క్రమంంలో బౌద్ధారామాలైన తొట్లకొండ, బావికొండ, పావురాల్లు కొండలు ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. అయితే అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని శాతవాహనులు వశపర్చుకున్నారు. దీంతో 230బీసీ నుంచి 220 ఏడీ మధ్య కాలంలో విశాఖ శాతవాహనులు పాలనలో ఉండేది. శాతవాహనులు సామ్రాజ్యం మహారాష్ట్రలోని పైథాన్ నుంచి అమరావతి వరకు విస్తరించింది. వీరి కాలంలో కూడా బౌద్ధం విలసిల్లింది.

    చాళుక్య రాజుల కాలంలో పెరిగిన హిందూ మత వ్యాప్తి

    శాతావాహనుల పతనం తర్వాత 220ఏడీ నుంచి 616ఏడీ మధ్య కాలంలో వైజాగ్ చరిత్ర గురించిన సమాచారం మరుగున పడిపోయింది. అయితే సరిహద్దులు మార్చుకొని రాజులు రాజ్యాలు పాలన సాగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ కాలంలో గుప్తవంశం పాలించినట్లు ఆనవాళ్లు చెబుతున్నాయి.అలాగే 616ఏళ్ల నుంచి 1070మధ్య కాలంలో వైజాగ్‌ను వెంగి చాళక్యులు పాలించారు. 616లో చాళుక్య రాజు రెండో పులకేసి కోస్తాంధ్రను స్వాధీనం చేసుకున్నారు. పులకేసి మరణం తర్వాత అతని సోదరుడు విష్ణువర్దన్‌ను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. వైజాగ్‌కు ఉత్తరాన 100కి.మీ వరకు విస్తరించి ఉన్న తూర్పు చాళుక్య రాజ్యాన్ని విష్ణువర్దన్‌ను స్థాపించాడు. ఈ ప్రాంతంలో క్రమంగా చాళుక్య రాజులు హిందూమతాన్ని స్వీకరించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత బౌద్ధం కనుమరుగైంది.

    1060లో సింహాచలం ఆలయం నిర్మాణం

    తూర్పు చాళుక్యల తర్వాత అంటే 1070 మొదట్లో కళింగ గంగులు విశాఖను పాలించారు. ఆ సమయంలోనే హిందూ దేవాలయాలు కూాడ నిర్మించడం మొదలైనట్లు ఆనావాళ్లు చెబుతున్నాయి. విష్టువు అవతారాల్లో ఒకటైన నరసింహస్వామి పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయాన్ని 1060లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణం కూడా అుటు ఒడియా, ద్రవిడ కలయిలో ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో 1098నాటి చోళరాజు శాశనం ఆలయ చరిత్ర తెలియజేస్తుంది. 1070లో ప్రారంభ గంగా అధిపతి రాజరాజుతో రాజవంశం ఉద్భవించింది. వీరు చోళులకు వ్యతిరేకంగా పోరాడారు. వీరిని తుర్పు గంగాలుగా పిలుస్తుంటారు. వీరు 70ఏళ్ల పాటు పాలించారు. భానుదేవ IV గజపతిలో గంగారాజుల పాలన ముగుస్తుంది.

    1434లో గజపతిల ఆధీనంలోకి విశాఖ 

    1434లో విశాఖ ప్రాంతం గజపతిల ఆధీనంలోకి వచ్చించింది. గతపతిల వంశాన్ని ప్రారంభించిన వ్యక్తి భానుదేవ-IV గజపతి ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. గజపతి రాజు మనవడు ప్రతాప్ రుద్ర 1515లో విజయనగరానికి చెందిన కృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయాడు. 1541వరకు గజపతిలు తమ పాలనను సాగించారు. 1560, 1568లో వైజాగ్ ప్రాంతాలు గోల్కొండ సుల్తానేట్ స్వాధీనంలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత నుంచి గోల్కొండ సుల్తానులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 1662సమయంలో విశాఖ ప్రాంతం డచ్ వారి పాలనలోకి వెళ్లింది. యురోపియన్ వారికి ఆతిధ్యం ఇవ్వడం ప్రారంభించింది. డచ్ వారి మొదటి స్థావరం భీమ్లీ వద్ద ఉంది. 1781లో బ్రిటీష్-డచ్ మధ్య జరిగిన యుద్ధంలో డచ్ ఫ్యాక్టరీ ధ్వంసమైంది. ఆ తర్వాత బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది.

    1769 నాటికి రాజధానిగా విశాఖపట్నం 

    1687లో దక్షిణ భారతదేశంలో దక్కన్ సుల్తానేట్‌ను ఔరంగజేబు ఓడించడం ద్వారా మొఘల్ పాలన ప్రారంభం అవుతుంది. అయితే దక్కన్ ప్రాంతాలను పాలించడానికి ఔరంగజేబు గవర్నర్లను నియమించుకున్నాడు. వారినే సుబేదార్లు అని పిలుస్తారు. 1707లో ఔరంగజేబు మరణం తర్వాత సుబేదార్లు స్వతంంత్రంగా మారారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ సుబేదార్ నిజాం-ఉల్-ముల్క్, అసఫ్ జాహీ అనే కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో నిజాంకు వైజాగ్‌లో స్థావరాలు ఉండేవి. 1758నాటికి బ్రిటిష్ వారు వైజాగ్ ప్రాంతంపై నియంత్రణ సాధించారు. 1758-59లో బ్రిటీష్ సైన్యం ఫ్రెంచ్ వారిని ఓడించి ఉత్తర సర్కార్ జిల్లాలను స్వాధీనం చేసుకుంది, 1769లో విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    విశాఖపట్టణం
    వైజాగ్
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    విశాఖపట్టణం

     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం హైదరాబాద్
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
     వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ  వైజాగ్
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం  ఆంధ్రప్రదేశ్

    వైజాగ్

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తాజా వార్తలు
    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  కూరగాయలు
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి విద్యా శాఖ మంత్రి

    తాజా వార్తలు

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పాకిస్థాన్
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023