కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 256కి చేరుకుంది. ఈ ఘటనలో 130 ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో 200 మందికి పైగా గల్లంతైనట్లు తెలిసింది. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. సైన్యం, ఎన్డీఎఫ్ సిబ్బంది ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇవాళ ఆఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్న పినరయి విజయన్
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. కోజికోడ్‌లో సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1,500 మంది ఆర్మీ సిబ్బందిని రెస్క్యూ ఆపరేషన్ కోసం మోహరించాయి. జూలై 31 అర్థరాత్రి వరకు 1,592 మందిని రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించే వరకు ప్రయత్నాలు కొనసాగిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. బెయిలీ వంతెన నిర్మాణానికి సైన్యం రాత్రంతా శ్రమిస్తూనే ఉంది, కానీ అది పూర్తి కాలేదు. ఈ వంతెనపై రాకపోకలు ఈరోజు పునరుద్ధరించే అవకాశం ఉంది.
వాయనాడ్ ను సందర్శించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం వాయనాడ్‌లోని సహాయక శిబిరాలను సందర్శించనున్నారు. రానున్న రెండు రోజుల్లో వాయనాడ్, ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.