IMD Warning: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..హెచ్చరించిన వాతావరణ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.
వర్షాలతో పాటు హిమపాతం కూడా కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశముండగా, హిమపాతం కూడా అధికంగా కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
గురువారం నాడు జమ్మూ-కాశ్మీర్, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశముందని పేర్కొంది.
అలాగే ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది.
వివరాలు
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, దీనికి అనుగుణంగా అస్సాం, పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో నాగాలాండ్ సమీప ప్రాంతంలో తుఫాన్ ఏర్పడనుందని వెల్లడించింది.
ఈ ప్రభావంతో రాబోయే ఏడు రోజుల్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు అస్సాం, మేఘాలయ సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.