Page Loader
Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ?
బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ?

Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ?

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
07:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ధోతీ, మెడలో రుద్రాక్ష మాల,చెప్పుల్లేని పాదాలు...ఈ విధంగా నడి వయస్సు వ్యక్తి ఒకరు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయన పేరు ఆచార్య విశ్వనాథ్‌. ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా? కాని అసలు విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈయన అసలు పేరు జొనాస్ మాసెట్టి. ఆయన బ్రెజిల్‌ దేశానికి చెందినవారు. వేదాలు,భగవద్గీత,భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ప్రచారం చేస్తున్నందుకు గాను ఆయనకు భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకుంటున్నారు. భారత సంస్కృతి పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రజలు ప్రశంసలతో కొనియాడుతున్నారు. ఫలితంగా,'ఈయన ఎవరయ్యా?'అంటూ అందరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.Embed

వివరాలు 

పలు ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు

జొనాస్ మాసెట్టి బ్రెజిల్‌ దేశానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు, వేద పండితుడు. రియో డి జనీరో నగరంలో జన్మించిన ఆయన, మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. ఆ తరువాత పలు ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. అయినా, పాశ్చాత్య జీవనశైలి, డబ్బు, స్నేహితులు ఇవేమీ ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. జీవితం అసలైన అర్థం ఏమిటనే క్వశ్చన్‌తో ఆయన భారతదేశానికి వచ్చారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలో చేరారు. ఆయన మార్గదర్శనంలో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంచుకున్నారు. వేదాలు, భగవద్గీత బోధనలు ఆయనను జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ మార్పుతోనే జొనాస్‌ మాసెట్టి కాస్తా 'ఆచార్య విశ్వనాథ్‌'గా మారారు.

వివరాలు 

వేద జ్ఞానాన్ని ఉచితంగా ఆన్‌లైన్ కోర్సుల రూపంలో..

ఆధ్యాత్మిక కేంద్రంగా బ్రెజిల్‌ను మలిచిన ఆచార్య విశ్వనాథ్‌,భారత్‌ నుంచి తిరిగి స్వదేశమైన బ్రెజిల్‌కు వెళ్లిన తరువాత,రియో డి జనీరోలో 'విశ్వ విద్య గురుకులం' అనే ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు. కోయంబత్తూరులో తాను సంపాదించుకున్న వేద జ్ఞానాన్ని ఉచిత ఆన్‌లైన్ కోర్సుల రూపంలో అందించడం ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏడేళ్ల కాలంలో సుమారు 1.5లక్షల మందికి పైగా విద్యార్థులకు ఆధ్యాత్మిక బోధనలు అందించారు.

వివరాలు 

'సాంస్కృతిక వారధి'గా జొనాస్‌

భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ 2024లో నిర్వహించిన 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో ఆయన గురించి ప్రస్తావించారు. 'సాంస్కృతిక వారధి'గా ఆయనను అభివర్ణించారు. అంతేకాక, గతంలో బ్రెజిల్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఆయనను కలిశారు కూడా. జొనాస్‌ యోగా, వేదాలపై అనేక పుస్తకాలను రచించారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డు తనకు ఊహకు అందని విషయం అని, అయితే దీనిని తాను ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆచార్య విశ్వనాథ్‌ ఆనందంతో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాష్ట్రపతి నుండి అవార్డు అందుకుంటున్న ఆచార్య విశ్వనాథ్‌