Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరణ.. ఇక భారత్‌లోనే
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళన పరిస్థితుల కారణంగా షేక్ హసీనా ఇండియాలో తలదాచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు అడుగడుగునా ఇబ్బందులే ఎదరువుతున్నాయి. ఢాకాలోని ప్రధాని ప్యాలెస్ ను ఆందోళన కారులు చుట్టముట్టడంతో ఆమె తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి లండన్‌కు వెళ్లి ఆమె స్థిరపడాలని అనుకుంది. అయితే తాజాగా దీనిపై బ్రిటన్ ఒకరు స్పందించారు. షేక్ హసీనాకు అనుమతి లేదని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో షేక్ హసీనా మరింత కాలం భారత్‌లోనే ఉండనున్నారు.
షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందకు బ్రిటన్ నిరాకరణ
షేక్ హసీనా సోమవారం సాయంత్రం దిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగారు. ఆమె సోదరి షేక్ రెహానా బ్రిటీష్ పౌరురాలు కావడంతో ఆమె UKలో ఆశ్రయం పొందవచ్చని ప్రాథమిక నివేదికలు సూచించాయి. ఏదిఏమైనా షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వమని బ్రిటిష్ ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఏదైనా అవసరంలో ఉన్నవారికి రక్షణ కల్పించడంలో బ్రిటన్‌కు ఎంతో మంచి రికార్డు ఉంది. అయితే ఆశ్రమం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా క వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా తమ వలస చట్టాల్లో లేదని యూకే స్పష్టం చేసింది.
ఆశ్రమం కల్పించడంలో భారత్ వెనుకాడవచ్చు
షేక్ హసీనాకు ఆశ్రమం కల్పించడంలో భారతదేశం కూడా వెనుకాడవచ్చు. ఆమె కుమారుడు నివసించే అమెరికాలో కూడా హసీనా వీసాను రద్దు చేసినట్లు తెలుస్తోంది. షేక్ హసీనాకు భారత్ మద్దతు ఇవ్వడం భారతదేశ తూర్పు సరిహద్దులో కూడా ఘర్షణ వాతావరణం జరగొచ్చు. భారతదేశం బంగ్లాదేశ్‌తో 4,096 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. ఒకవేళ షేక్ హసీనా ఎక్కడికైనా వెళ్లాలంటే ఆమె ప్రయాణ భద్రతను భారత్ చూసుకొనే అవకాశాలు లేకపోలేదు.