Page Loader
Rahul Gandhi: 'త్వరలో పెళ్లిచేసుకుంటున్న' : రాహుల్ గాంధీ
'త్వరలో పెళ్లిచేసుకుంటున్న' : రాహుల్ గాంధీ

Rahul Gandhi: 'త్వరలో పెళ్లిచేసుకుంటున్న' : రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Stalin
May 13, 2024
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మళ్లీ ర్యాలీ నిర్వహించేందుకు రాయ్‌బరేలీ చేరుకున్నారు. రాహుల్ ప్రసంగం ముగియగానే అక్కడి ప్రజలు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు.ఈ సందర్భంగా అయన పెళ్లి గురించి ప్రశ్న అడిగారు. వారి ప్రశ్నకు సమాధానంగా రాహుల్ గాంధీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు.కేరళలోని వాయనాడ్‌ నుంచి ఎంపీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఈసారి రెండు లోక్‌సభ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన వాయనాడ్ స్థానానికి ఇప్పటికే ఓటింగ్ జరిగింది.

Details 

ప్రచారం చేస్తున్న ప్రియాంక 

ఇది కాకుండా,అయన యుపిలోని రాయ్ బరేలీ స్థానం నుండి కూడా పోటీ చేస్తున్నారు.ఈ స్థానానికి మే 20న పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా రాయ్‌బరేలీలో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఆమె ఒక రోజులో సుమారు 16 గ్రామాలను సందర్శిస్తోంది. ఇదిలావుండగా, మే 17న రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ల సంయుక్త ర్యాలీ కూడా జరగనుందని కూడా చెబుతున్నారు. ఇటీవల, రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇండియా బ్లాక్ బ్యానర్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు.