Page Loader
Irctc Packages: వేసవి సెలవుల్లో దక్షిణ భారత్‌లో పర్యటిస్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలివీ!
వేసవి సెలవుల్లో దక్షిణ భారత్‌లో పర్యటిస్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలివీ!

Irctc Packages: వేసవి సెలవుల్లో దక్షిణ భారత్‌లో పర్యటిస్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలివీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి సెలవుల్లో దక్షిణ భారతదేశం చూసేందుకు ఆసక్తిగా ఉన్నారా? కానీ ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలియట్లేదా? అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా పలు పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీల విశేషాలను ఒకసారి పరిశీలించండి - మీకు నచ్చితే వెంటనే బ్యాగ్‌ పట్టుకుని బయలుదేరవచ్చు!

వివరాలు 

కాఫీ విత్ కర్ణాటక 

పచ్చని కొండలు,సుందర జలపాతాలు,చారిత్రక నిర్మాణాలు,సువాసనలతో నిండిన కాఫీ తోటలు... ఇవన్నీ కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం అందించే ప్రత్యేకతలు. మైసూర్ ప్యాలెస్‌ అందాలు,చందనంతో తయారు చేసిన కళాఖండాలూ మైసూర్‌ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ ప్రాంతాల పర్యటన కోసం ఐఆర్‌సీటీసీ 'కాఫీ విత్ కర్ణాటక' ప్యాకేజీని అందిస్తోంది. ప్రతి బుధవారం కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది.ప్యాకేజీ ధర రూ.11,260 నుంచి ప్రారంభమవుతుంది.

వివరాలు 

కాఫీ విత్ కర్ణాటక 

1వ రోజు: రాత్రి 7:05కి కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది. 2వ రోజు: ఉదయం 9:30కి మైసూర్ చేరుకున్నాక, అక్కడి నుంచి కూర్గ్‌కి తీసుకెళ్తారు. హోటల్‌ బస తర్వాత అబ్బే జలపాతం, ఓంకారేశ్వర ఆలయం దర్శనం. రాత్రి బస కూర్గ్‌లో. 3వ రోజు: బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత తలకావేరి, భాగమండల, రాజా సీట్ పార్క్‌ దర్శనం. రాత్రి బస కూర్గ్‌లోనే. 4వ రోజు: మైసూర్‌కి తిరిగి తీసుకెళ్తారు. మార్గంలో కావేరి నిసర్గధామ, టిబెటన్ మానెస్టరీ, బృందావన్ గార్డెన్స్ సందర్శిస్తారు. రాత్రి బస మైసూరులో. 5వ రోజు: చాముండి హిల్స్‌, మైసూర్ ప్యాలెస్‌ దర్శనం తర్వాత మధ్యాహ్నం రైలు. ఆరో రోజు ఉదయం 5:40కి కాచిగూడ చేరుకుంటారు.

వివరాలు 

అల్టిమేట్ ఊటీ  

ఊటీ, కూనూర్ వంటి పచ్చని కొండల ప్రాంతాలు చూడాలనుకుంటే 'అల్టిమేట్ ఊటీ' ప్యాకేజీ ఉత్తమ ఎంపిక. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి ఈ ప్యాకేజీ ప్రారంభమవుతుంది.ప్రారంభ ధర రూ.13,070. 1వ రోజు: మధ్యాహ్నం 12:20కి సికింద్రాబాద్ నుంచి రైలు. 2వ రోజు: ఉదయం 7:57కి కోయంబత్తూర్ చేరుకుని, అక్కడి నుంచి ఊటీకి తీసుకెళ్తారు. బొటానికల్ గార్డెన్‌, ఊటీ సరస్సు దర్శనం. రాత్రి బస ఊటీలో. 3వ రోజు: దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, ప్యాకార ఫాల్స్ దర్శనం. రాత్రి బస ఊటీలోనే. 4వ రోజు: కూనూర్ పర్యటన, తిరిగి ఊటీకి. 5వ రోజు: మధ్యాహ్నం కోయంబత్తూర్లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కడం. 6వ రోజు: మధ్యాహ్నం 12:45కి సికింద్రాబాద్ చేరుకుంటారు.

వివరాలు 

కోస్టల్ కర్ణాటక 

మురుడేశ్వర్‌,శృంగేరి,ఉడిపి వంటి తీరం ప్రాంతాలు చుట్టేందుకు ఈ ప్యాకేజీ ఉపయుక్తం. ప్రతి మంగళవారం కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది.ధర రూ.14,110 నుంచి. 1వ రోజు: ఉదయం 6:05కి కాచిగూడ నుంచి మంగళూరు ఎక్స్‌ప్రెస్‌. 2వ రోజు: ఉదయం మంగళూరు చేరుకుని, ఉడిపికి తరలింపు. శ్రీ కృష్ణ దేవాలయం,మాల్పె బీచ్‌ దర్శనం. రాత్రి బస ఉడిపిలో. 3వ రోజు: కొల్లూరు మూకాంబిక దేవాలయం, మురుడేశ్వర్ ఆలయం, గోకర్ణ దర్శనాలు. రాత్రి బస ఉడిపిలో. 4వ రోజు: హోర్నాడు అన్నపూర్ణ దేవాలయం, శృంగేరి శారదాంబ ఆలయం సందర్శన. రాత్రి బస మంగళూరులో. 5వ రోజు: మంగళదేవి, కద్రి మంజునాథ ఆలయాలు, తన్నెర్బవి బీచ్‌ దర్శనం. రాత్రి రైలు ప్రయాణం. 6వ రోజు: రాత్రి 11:40కి కాచిగూడ చేరుకుంటారు.

వివరాలు 

డివైన్ కర్ణాటక 

కర్ణాటక ప్రముఖ ఆలయాలను దర్శించాలనుకుంటే ఈ ప్యాకేజీ ఉత్తమ ఎంపిక. మంగళవారం కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. ధర రూ.14,090. 1వ రోజు: ఉదయం 6:05కి కాచిగూడ నుంచి రైలు. 2వ రోజు: మంగళూరు చేరుకుని ఉడిపికి తరలింపు. శ్రీకృష్ణ దేవాలయం, మాల్పె బీచ్‌. రాత్రి బస ఉడిపిలో. 3వ రోజు: శృంగేరి శారదాంబ ఆలయం దర్శనానికి వెళ్లి తిరిగి మంగళూరులో బస. 4వ రోజు: ధర్మస్థల మంజునాథ, కుక్కే సుబ్రమణ్య ఆలయాలు. రాత్రి మంగళూరులో బస. 5వ రోజు: మంగళాదేవి, కద్రి మంజునాథ ఆలయాలు, తన్నెర్బవి బీచ్‌, గోకర్నాథ ఆలయం దర్శనం. రాత్రి రైలు ప్రయాణం. 6వ రోజు: రాత్రి 11:40కి కాచిగూడ చేరుకుంటారు.

వివరాలు 

వండర్స్ ఆఫ్ వయనాడ్

కేరళ సహజసిద్ధ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్యాకేజీ మీ కోసం. కాచిగూడ నుంచి ప్రతి మంగళవారం ప్రారంభం. ధర రూ.14,950. 1వ రోజు: ఉదయం 6:05కి రైలు ప్రయాణం. 2వ రోజు: ఉదయం 6:17కి కన్నూర్ చేరుకుని సెయింట్ అగ్నెలో కోట, అరక్కాల్ మ్యూజియం సందర్శన. కాల్పెట్ట చేరి రాత్రి బస. 3వ రోజు: కురువాద్వీప్‌, తిరునెళ్లి ఆలయం, బాణాసుర సాగర్ డ్యామ్‌. రాత్రి బస కాల్పెట్టలోనే. 4వ రోజు: హెరిటేజ్ మ్యూజియం, సూచిపరా ఫాల్స్‌, ఎడక్కల్ గుహలు, సరస్సు. రాత్రి బస కాల్పెట్టలో. 5వ రోజు: కొయ్‌కోడ్‌లో కప్పాడ్ బీచ్‌, ఎస్‌.ఎం స్ట్రీట్‌ షాపింగ్‌. రాత్రి రైలు. 6వ రోజు: రాత్రి 11:40కి కాచిగూడ చేరుకుంటారు.

వివరాలు 

కేరళ హిల్స్ అండ్ వాటర్స్ 

ఈ ప్యాకేజీ ద్వారా మున్నార్, అలెప్పీ వంటి కేరళ హిల్ల్స్, బ్యాక్ వాటర్స్ చూడొచ్చు. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి ప్రారంభం. ధర రూ.14,720. 1వ రోజు: ఉదయం 11:28కి శబరి ఎక్స్‌ప్రెస్‌. 2వ రోజు: మధ్యాహ్నం 12:55కి అలువా చేరుకుని మున్నార్ వెళ్లాలి. సాయంత్రం మున్నార్ చుట్టుపక్కల దర్శనం. రాత్రి బస. 3వ రోజు: ఎరవికుళం నేషనల్ పార్క్‌, టీ మ్యూజియం, ఎకో పాయింట్‌, డ్యామ్‌. రాత్రి మున్నార్‌లో బస. 4వ రోజు: అలెప్పీ బ్యాక్‌వాటర్స్‌ దర్శనం, రాత్రి బస అక్కడే. 5వ రోజు: ఎర్నాకుళం చేరి శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. 6వ రోజు: మధ్యాహ్నం 12:20కి సికింద్రాబాద్ చేరుకుంటారు.

వివరాలు 

ఇతర సమాచారం: 

ఈ ప్యాకేజీలన్నీ 5 రాత్రులు / 6 పగళ్లు కొనసాగుతాయి. రవాణా, బ్రేక్‌ఫాస్ట్ ఖర్చులు ఐఆర్‌సీటీసీ భరిస్తుంది. లంచ్‌, డిన్నర్‌, వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులే భరించాలి. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికార వెబ్‌సైట్‌ irctctourism.com ను సందర్శించండి - సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీలలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి!