Underground Cities: భూగర్భంలో దాగి ఉన్న వింత నగరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. కొత్త అభివృద్ధులతో నిర్మాణ రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయి.
నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా ఇళ్లు నిర్మించడం సులభమవుతోంది.
కొన్ని దేశాల్లో భూగర్భంలోనే నగరాలు నిర్మించారు. అలాగే, ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 36 భూగర్భ నగరాలు నిర్మించారు.
ఈ భూగర్భ నగరాలను యుద్ధాలు, దాడుల నుండి రక్షణ పొందడానికి నిర్మించారు.
బంకర్లు, సొరంగాలు, పెద్ద పెద్ద గుహల రూపంలో ఉండే ఈ నగరాలు ఇప్పటికీ చరిత్రలో గుర్తింపుగా నిలిచాయి. ఇలాంటి పాపులర్ అండర్‌గ్రౌండ్ నగరాల్లో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం..
వివరాలు
యూకేలోని బర్లింగ్టన్
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అణు దాడుల నుండి దేశ ప్రజలను,సైన్యాన్ని రక్షించేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 60మైళ్ల మేర బంకర్ నిర్మించాలని నిర్ణయించింది.
1950లో క్రోశాం ప్రాంతంలో ఈ బంకర్‌ను నిర్మించి,దీనికి "బర్లింగ్టన్"(Burlington)అని పేరు పెట్టారు. శత్రు దేశాలు కనుగొనలేని విధంగా అత్యంత భద్రతతో ఈ బంకర్‌ను నిర్మించారు.
4,000 మంది కీలక వ్యక్తులతో పాటు నాటి బ్రిటీష్ ప్రధానిని కూడా రక్షించేందుకు బంకర్‌ను ప్రణాళికబద్ధంగా నిర్మించారు.
ఇక్కడ తలదాచుకునేందుకు అనేక సదుపాయాలు ఉన్నాయి. వైద్యశాలలు, నిద్రించేందుకు గదులు, టెలిఫోన్ ఎక్స్చేంజి, బీబీసీ స్టూడియో తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఈ బంకర్‌లో 1991 వరకు కార్యకలాపాలు కొనసాగాయి. 2004 తర్వాత ఈ కార్యచరణలు నిలిపివేయబడ్డాయి. బంకర్, ప్రచ్ఛన్న యుద్ధానికి గుర్తుగా నిలిచిపోయింది.
వివరాలు
కెనాడాలోని మాంట్రియల్
కెనడాలోని మాంట్రియల్ (Montreal)అత్యంత ప్రముఖమైన భూగర్భ పర్యాటక కేంద్రం. 1962లో కెనడా ప్రభుత్వం దీన్ని నిర్మించింది.
4.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రదేశం సొరంగం ఆకృతిలో ఉంటుంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా చేరుకోవడానికి సంక్లిష్ట మార్గాలతో కూడిన సొరంగం ఇది.
ఈ సొరంగానికి నాటి ప్రభుత్వం రెసో అనే పేరు పెట్టింది, దీని అర్థం నెట్‌వర్క్. రెసోలో హోటళ్లు, లైబ్రరీలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, నైట్ క్లబ్బులు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
సొరంగంలోకి 200 ద్వారాల ద్వారా ప్రవేశించవచ్చు. కెనడాలో హిమపాతం జరిగే కాలంలో ఫ్రాన్స్‌కు చెందిన పర్యాటకులు ఇక్కడికి వచ్చి గడుపుతారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా ప్రసిద్ధి పొందింది.
వివరాలు
టర్కీలోని డోరీకుయు
టర్కీలోని అత్యంత ప్రాచీన నగరాల్లో డోరీకుయు (Derinkuyu) ఒకటి. ఈ నగరం భూగర్భంలో వలయాకారంలో ఉంటుంది.
క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో జరిగిన యుద్ధాల సమయంలో సైన్యం మరియు సాధారణ ప్రజలు తలదాచుకునేందుకు, నాటి రాజ్యం ఈ నగరాన్ని నిర్మించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 36 భూగర్భ నగరాల్లో ఇదే లోతైన నగరం. డోరీకుయులో ఒకచోట నుంచి మరోచోటికి వెళ్లేందుకు అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి.
యుద్ధం జరుగుతుందని భావించిన సమయంలో ప్రజలు ఇక్కడ భద్రంగా ఉండేందుకు అనేక నేల మాళిగలు ఉన్నాయి.
ఇవి ఆధునిక కాలంలో మనం బంకర్లు అని పిలుస్తున్నాం. ఈ ప్రదేశం ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తుండగా, ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తున్నారు.
వివరాలు
జోర్డాన్‌లోని పెట్రా
నైరుతి జోర్డాన్‌లోని ఎర్రటి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ భూగర్భ పట్టణం పెట్రా (Petra) ప్రపంచంలో ప్రసిద్ధ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
యునెస్కో(UNESCO)కూడా దీనికి గుర్తింపు ఇచ్చింది. క్రీ.పూ 4వ శతాబ్దంలో నాబాటేయన్ తెగ ఈ పెట్రా పట్టణాన్ని నిర్మించగా, క్రీ.శ 1800లో మొదటిసారిగా దీని ఉనికి బయటపడింది.
నాబాటేయన్ ప్రజల నాగరికతకు చిహ్నంగా ఇప్పటికీ పట్టణం వర్ధిల్లుతోంది.ఇక్కడ సుమారు 30,000 మంది నివసించేందుకు వీలుగా వేల సంఖ్యలో గుహల వంటి నిర్మాణాలు ఉన్నాయి.
ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య ఉండే గుహల్లో నాటి రాజ్యం విలువైన సంపదను దాచిపెట్టేది. క్రీ.శ.7వ శతాబ్దం నుంచి నాబాటేయన్లు పట్టణంపై తమ ఆధీనాన్ని కోల్పోయారు.
కాలక్రమేణా ఇది రోమ్ సామ్రాజ్యంలో విలీనమైంది.
వివరాలు
ఫ్రాన్స్‌లోని నౌర్స్
ఫ్రాన్స్‌లోని నౌర్స్ (Naours) అనే భూగర్భ నగరం క్రీ.శ 3వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది దేశంలోని అత్యంత సంక్లిష్టమైన ప్రదేశాలలో ఒకటి.
ఈ ప్రాంతంలో సుమారు వేలాది మంది నివసించేందుకు వీలుగా 300 గదులు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యంత రహస్యమైన ప్రాంతం.
యుద్ధ సమయంలో ప్రభువు మరియు సైన్యం తలదాచుకునేందుకు ఈ నగరాన్ని నిర్మించారు.
ఇక్కడ నీటి అవసరాలను తీర్చేందుకు బావులు కూడా ఏర్పాటు చేశారు. ఆరాధన కోసం ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి.
వివరాలు
ఆస్ట్రేలియాలోని కూపర్‌పెడీ
ప్రపంచ ప్రఖ్యాత భూగర్భ నగరాల్లో కూపర్‌పెడీ (Coober Pedy) పట్టణం ఒకటి.
"కూపర్‌పెడీ" అనే పేరు "కూపా-పిడీ" అనే పదం నుంచి వచ్చిందని భావిస్తారు.దీని అర్థం "నీటి రంధ్రం" లేదా "రంధ్రంలో తెల్ల మనిషి".
ఇది దక్షిణ ఆస్ట్రేలియాలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరు పొందింది.
ఈ ప్రాంతం అత్యంత అరుదైన ఓపాల్ (ఒక రత్నం) రాయి దొరికే ప్రదేశంగా ప్రఖ్యాతి గాంచింది.
కూపర్‌పెడీ ఓపాల్ గనుల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జనాభా సుమారు 2,500 మంది మాత్రమే ఉంది.
ఇక్కడి ప్రజలు బయట ఉన్న తీవ్రమైన వేడిని తట్టుకునేందుకు భూగర్భంలో నివసిస్తారు.