
Vande Bharat Ticket Booking: వందేభారత్ రైళ్లలో ప్రయాణానికి 15 నిముషాల ముందు కూడా రిజర్వేషన్
ఈ వార్తాకథనం ఏంటి
చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వేలు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్రయాణికులు ఇక రైలు బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 144 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అనుకోకుండా ప్రయాణించాల్సిన అవసరం వచ్చినవారికోసం, బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకే ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
వివరాలు
ఏ ఏ స్టేషన్లకు ఈ సౌకర్యం ఉంది?
ప్రస్తుతం ఈ సౌకర్యం నదక్షిణ రైల్వే (Southern Railway) జోన్ పరిధిలో నడుస్తున్న ఎనిమిది వందే భారత్ రైళ్లకు వర్తిస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని ప్రధాన మార్గాలు ఉంటాయి. దక్షిణ రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. "దక్షిణ రైల్వే జోన్‌కి చెందిన ఎనిమిది వందే భారత్ రైళ్లకు సంబంధించి, మధ్యలో ఉన్న స్టేషన్ల నుంచి కూడా రైలు బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ టికెట్ బుకింగ్ చేయవచ్చు."
వివరాలు
పావుగంట ముందు కూడా రిజర్వేషన్ చేసుకునే రైళ్లు ఇవే:
20631 మంగళూరు సెంట్రల్ - తిరువనంతపురం సెంట్రల్ 20632 తిరువనంతపురం సెంట్రల్ - మంగళూరు సెంట్రల్ 20627 చెన్నై ఎగ్మూర్ - నాగర్‌కోయిల్ 20628 నాగర్‌కోయిల్ - చెన్నై ఎగ్మూర్ 20642 కోయంబత్తూరు - బెంగళూరు కాంటీన్ 20646 మంగళూరు సెంట్రల్ - మడగావ్ 20671 మధురై - బెంగళూరు కాంటీన్ 20677 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - విజయవాడ
వివరాలు
ఎలా బుక్ చేయాలి?
ఇందుకోసం భారత రైల్వేలు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ను అప్గ్రేడ్ చేశాయి. ఇప్పుడు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ ఖాళీ సీట్ల వివరాలు తెలుసుకోని బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ స్టెప్స్ ఇవే: IRCTC అధికారిక వెబ్‌సైట్ (www.irctc.co.in)లేదా IRCTC Rail Connect యాప్ ఓపెన్ చేయాలి. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారు లాగిన్ అవ్వాలి.కొత్తవారు సైన్ అప్ కావాలి. ప్రయాణ వివరాలు (ప్రారంభ-గమ్య స్టేషన్లు,తేదీ,రైలు ఎంపిక) ఇవ్వాలి. సీటు లభ్యతను చెక్ చేయాలి. బోర్డింగ్ స్టేషన్, క్లాస్ (Executive/Chair Car)ఎంపిక చేసుకోవాలి. తరువాత పేమెంట్ చేయాలి. టికెట్ బుక్ అయిన తర్వాత మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కు ఈ-టికెట్ వస్తుంది.
వివరాలు
నిబంధన మారడంతో.. చివరి నిమిషంలో టికెట్..
ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్ ఒక స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత మిగిలిన స్టేషన్ల నుంచి టికెట్ బుక్ చేయడం సాధ్యపడేది కాదు. ఇప్పుడు ఈ నిబంధన మారడంతో, ట్రైన్ మధ్యలో ఉన్న స్టేషన్ల నుంచి కూడా, సీట్లు ఖాళీగా ఉన్నపుడు ప్రయాణికులు చివరి నిమిషంలో టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు.