Radical Users: రాడికల్ యూజర్లకు సహాయం దిశగా చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్ కొత్త ప్రయత్నం
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌లో కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ అభివృద్ధి అవుతోంది. ఈ టూల్ ముఖ్యంగా చాట్‌జీపీటీ వాడుతున్న రాడికల్ భావాలు ఉన్న యూజర్లకు సహాయం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను త్రూలైన్ అనే స్టార్ట్‌అప్ ముందుకు తీసుకెళ్తోంది. ఈ సంస్థ ఇప్పటికే ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేసింది. గతంలో స్వీయహాని లేదా గృహహింసకు సంబంధించిన సంకేతాలు ఉన్న యూజర్లను సరైన సహాయక సేవలకు మళ్లించే విషయంలో కూడా ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. త్రూలైన్ వ్యవస్థాపకుడు ఎలియట్ టేలర్ మాట్లాడుతూ,ఇప్పుడు సంస్థ తన సేవలను విస్తరించి హింసాత్మక తీవ్రవాదాన్ని నివారించడంపై కూడా దృష్టి పెడుతున్నట్టు తెలిపారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 180దేశాల్లో 1,600హెల్ప్‌లైన్‌ల నెట్‌వర్క్
2019 న్యూజిలాండ్ ఉగ్రదాడుల తర్వాత ప్రారంభమైన క్రైస్ట్‌చర్చ్ కాల్ అనే యాంటీ-ఎక్స్‌ట్రీమిజం కార్యక్రమంతో కూడా ఈ స్టార్ట్‌అప్ చర్చలు జరుపుతోంది. ఈ కొత్త టూల్ అభివృద్ధిలో ఆ సంస్థ మార్గదర్శకత్వం అందించనుంది. గ్రామీణ న్యూజిలాండ్‌లో టేలర్ ఇంటి నుంచే పనిచేస్తున్న త్రూలైన్e ప్రస్తుతం AI కంపెనీలకు ముఖ్య భాగస్వామిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 180దేశాల్లో 1,600హెల్ప్‌లైన్‌ల నెట్‌వర్క్‌ను ఇది నిర్వహిస్తోంది. ఏదైనా AI వ్యవస్థ యూజర్‌లో సంక్షోభ సంకేతాలను గుర్తిస్తే,ఆ వ్యక్తిని త్రూలైన్ కు రిఫర్ చేస్తుంది. తర్వాత ఆ సంస్థ సమీపంలో ఉన్న మానవ సహాయక సేవలతో కనెక్ట్ చేస్తుంది. ఈ కొత్త టూల్ హైబ్రిడ్ మోడల్‌లో పనిచేస్తుందని టేలర్ తెలిపారు.
వివరాలు
రాడికల్ సంకేతాలు ఉన్న యూజర్లతో చాట్‌బాట్ మాట్లాడుతుంది
అంటే,ఒకవైపు రాడికల్ సంకేతాలు ఉన్న యూజర్లతో చాట్‌బాట్ మాట్లాడుతుంది,మరోవైపు వారికి నిజ జీవితంలో మానసిక ఆరోగ్య సేవల సహాయం అందిస్తుంది. అయితే,ఈ టూల్ ట్రైనింగ్ కోసం సాధారణ LLM డేటాను ఉపయోగించకుండా,నిపుణులతో కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రమాదకర యూజర్లపై అధికారులకు సమాచారం ఇవ్వాలా అనే అంశం ఇంకా పరిశీలనలో ఉందని టేలర్ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితి మరింత విషమం అయ్యే ప్రమాదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. సమస్యల్లో ఉన్న వారు ఆన్‌లైన్‌లో తాము వ్యక్తిగతంగా చెప్పని విషయాలను చెప్పే అవకాశముందని, అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ జోక్యం పరిస్థితిని మరింత క్లిష్టం చేయవచ్చని ఆయన హెచ్చరించారు.