ChatGPT-WhatsApp: చాట్‌జీపీటీ సంస్థ మరో కొత్త సదుపాయం.. ఇమేజ్ జనరేషన్,వాయిస్ నోట్ కు సపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ (OpenAI)కి చెందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) కొత్త సదుపాయంతో ముందుకొచ్చింది.
ఇప్పటి వరకు టెక్ట్స్ సందేశాలకు మాత్రమే స్పందించేదీ, ఇకపై ఆడియో, ఫొటో ఇన్‌పుట్‌లను కూడా విశ్లేషించి సమాధానాలు అందించనుంది. ఈ సదుపాయం గ్లోబల్‌గా అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటినుంచి మీరు వాట్సాప్ ద్వారా ఏదైనా చిత్రం అప్‌లోడ్ చేసి,దానిపై ప్రశ్న వేసినా చాట్‌జీపీటీ సమాధానం ఇస్తుంది.
మీ ఇమేజ్ ఓపెన్‌ఏఐ సర్వర్లకు పంపించబడుతుంది, అక్కడ ప్రాసెసింగ్ జరిగి, తగిన సమాధానం అందించబడుతుంది.
అయితే, వ్యక్తిగత సమాచారం షేర్ చేయకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదే విధంగా, వాయిస్ ఇన్‌పుట్‌ను కూడా విశ్లేషించి సమాధానాలు అందించగలదు.
వివరాలు
చాట్‌జీపీటీని వాట్సాప్‌లో ఎలా ఉపయోగించాలి?
కానీ, మీరు ఏ రూపంలో ప్రశ్నించినా, సమాధానం మాత్రం టెక్ట్స్ రూపంలోనే వస్తుంది. దీని వల్ల పెద్ద టెక్ట్స్ ఇన్‌పుట్‌గా ఇవ్వాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఓపెన్‌ఏఐ డిసెంబర్ 2024లో +18002428478 అనే ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ నంబర్‌ను మీ కాంటాక్ట్‌లలో సేవ్ చేసుకుంటే, మీరు అడిగిన ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా చాట్‌జీపీటీ స్పందిస్తుంది.
మునుపటిలా వెబ్‌సైట్ లేదా యాప్ అవసరం లేకుండా, నేరుగా వాట్సాప్‌లోనే ఈ సేవను పొందవచ్చు.
అయితే, రోజువారీ వినియోగానికి పరిమితి ఉంటుంది. ఇది పూర్తయ్యాక, నోటిఫికేషన్ ద్వారా మీకు సమాచారం అందుతుంది.