Page Loader
China: శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట 'డెత్‌స్టార్‌'.. 'స్టార్‌ వార్స్‌'తరహాలో సూపర్‌ వెపన్‌! 
శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట 'డెత్‌స్టార్‌'.. 'స్టార్‌ వార్స్‌'తరహాలో సూపర్‌ వెపన్‌!

China: శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట 'డెత్‌స్టార్‌'.. 'స్టార్‌ వార్స్‌'తరహాలో సూపర్‌ వెపన్‌! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ 'స్టార్ వార్స్'లోని 'డెత్ స్టార్' వంటి సూపర్ వెపన్ గుర్తుందా? అది శక్తివంతమైన లేజర్ కిరణాలతో గ్రహాలను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు, అంతరిక్షంలో శత్రు దేశాల ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే ఒక నిజమైన 'డెత్ స్టార్' వంటి సాంకేతికతను అభివృద్ధి చేశారు! ఈ సాంకేతికతకు సంబంధించిన ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆయుధానికి సంబంధించిన పూర్తి వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, అంతరిక్షంలో శత్రు ఉపగ్రహాలను నిలువరించేందుకు ఈ విధమైన ఆయుధాలు అభివృద్ధి చేస్తున్నట్లు కొన్ని చైనా జర్నల్స్ వెల్లడించాయి.

వివరాలు 

ఎలా పనిచేస్తుందంటే.. 

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ సూపర్ వెపన్ 'మైక్రోవేవ్ ఎనర్జీ'ని ప్రసారం చేసే ఏడు యంత్రాలను ఉపయోగిస్తుంది. ఈ యంత్రాలు ఒకదానితో ఒకటి ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా అనుసంధానమై ఉంటాయి. ఒక్కో యంత్రం శత్రు లక్ష్యంపై శక్తివంతమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ విడుదల చేస్తుంది. ఏడు యంత్రాల నుంచి ఏకకాలంలో విడుదలైన ఈ వేవ్స్ శత్రు లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తాయి. కానీ, నిర్దిష్ట లక్ష్యాన్ని తాకేందుకు అన్ని తరంగాలు కచ్చితమైన సమయానికి విడుదల కావాలి. ఈ తరంగాల సమన్వయం సెకనులో 170 లక్షల కోట్లవ వంతులో ఉండాలి. చైనా శాస్త్రవేత్తలు ఈ కచ్చితత్వాన్ని గతేడాదే సాధించారు.దూరంలో ఉన్న లక్ష్యంపై ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ తాకేందుకు లేజర్ పొజిషనింగ్ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నారు.

వివరాలు 

కమ్యూనికేషన్‌ నిర్వీర్యమే ఉద్దేశం 

మైక్రోవేవ్‌ ఆయుధాలు తమ లక్ష్యాలను నాశనం చేయడం కంటే శక్తివంతమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌ను విడుదల చేసి ఆ లక్ష్యాల్లోని ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌లను దెబ్బతీయడం ద్వారా పనిచేస్తాయి. ఈ విధంగా ఉపగ్రహాల వంటి సమాచార వ్యవస్థలలోని గ్రౌండ్‌ కేంద్రాలతో కమ్యూనికేషన్‌ నిలిచిపోతుంది. చిన్న లక్ష్యాలు, ముఖ్యంగా డ్రోన్లపై, ఈ తరహా ఆయుధాలు సమర్థవంతంగా పనిచేస్తాయని పలు ప్రయోగాల్లో నిర్ధారించబడింది.

వివరాలు 

యూకే డ్రాగన్‌ఫ్లై లేజర్‌ వెపన్‌ అభివృద్ధి 

అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ అభివృద్ధి చేసిన థోర్‌ (ద టాక్టికల్‌ హైపవర్‌ ఆపరేషనల్‌ రెస్పాండర్‌) అనే ఆయుధం కొన్ని వందల డ్రోన్లను ఒకేసారి నిరీ్వర్యం చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇటీవల, అగ్రరాజ్యం రష్యా లేదా చైనా శాటిలైట్‌ సిగ్నళ్లను నిలువరించగల మెడోలాండ్స్‌ అనే జామర్‌ ఆయుధాన్ని సమకూర్చుకుంది. అలాగే యూకే తన డ్రాగన్‌ఫ్లై లేజర్‌ వెపన్‌ను అభివృద్ధి చేసింది, ఇది గాల్లో ఎగిరే డ్రోన్లను కూల్చగలదు. ఈ ఆయుధానికి 1.5 కి.మీ. దూరంలో ఉన్న చిన్న లక్ష్యాలను కూడా ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం ఉంది.