NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?
    తదుపరి వార్తా కథనం
    SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?
    ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?

    SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా,భారత్ పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' అనే ప్రత్యేక సైనిక చర్యను చేపట్టింది.

    ఈ ఆపరేషన్‌లో ఉపయోగించిన అత్యాధునిక ఆయుధాల్లో ఆత్మాహుతి ద్రోణులైన స్కైస్ట్రైకర్లు కీలక పాత్ర పోషించాయి.

    ఈద్రోణులను బెంగళూరులో తయారు చేశారు. పశ్చిమ బెంగళూరులోని అల్ఫా డిజైన్ టెక్నాలజీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్‌బిట్ సిస్టమ్స్ సంస్థల కలయికతో స్కై స్ట్రైకర్లు అభివృద్ధి చేయబడ్డాయి.

    భారతసైన్యం వీటి ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి,2021లో వీటిని తయారు చేయాలని ఆదేశించింది.

    మొదటిగా 100 స్కై స్ట్రైకర్ల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.గతంలో బాలాకోట్‌లో జరిగిన సర్జికల్ దాడుల అనుభవం నేపథ్యంలో,భవిష్యత్తులో అవసరమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

    వివరాలు 

    ప్రాంతీయ పరిస్థితులపై సమగ్ర అవగాహన

    ప్రతి స్కై స్ట్రైకర్ ద్రోణి బరువు సుమారుగా 5 కిలోల నుండి 10 కిలోల వరకు ఉంటుంది.

    ఇది సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలదు.

    తక్కువ ఎత్తులోనూ ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి.అయితే ఈ ద్రోణుల తయారీ ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ, భవిష్యత్తులో వీటిని విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉందని సైనిక వర్గాలు భావిస్తున్నాయి.

    ఈద్రోణులు లక్ష్యాలను సులభంగా ఛేదించడమే కాకుండా,బలగాలకు ప్రాంతీయ పరిస్థితులపై సమగ్ర అవగాహనను కల్పించగలవు.

    అదే సమయంలో,మరింత ఖచ్చితమైన నిష్పత్తులు సాధించడంలో కూడా సహాయపడతాయి.

    ముఖ్యంగా ప్రత్యేక భద్రతా దళాల కార్యకలాపాల్లో వీటి వినియోగంఎంతో కీలకం కానుంది.

    సైనికుల ప్రత్యక్ష హాజరు లేకుండా కూడా,అత్యంత రహస్యమైన,ఎత్తైన స్థాయిలోని లక్ష్యాలను కూడా ఈద్రోణులు ఛేదించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..? ఆపరేషన్‌ సిందూర్‌
    NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది జూనియర్ ఎన్టీఆర్
    #NewsBytesExplainer: దేశ రక్షణలో దూసుకెళ్తుతోంది.. భారత ఆర్మీలో 'ఆకాష్ క్షిపణి' కీలక పాత్ర ఆర్మీ
    Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు  స్టాక్ మార్కెట్

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025