NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే
    భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే

    India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 10, 2025
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుండి భారత సైన్యం పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్ట పరిస్థితుల్లో ఉంచింది.

    భారతదేశానికి పాకిస్తాన్‌ను మోకరిల్లేలా చేయగల కిల్లర్ ఆయుధ వ్యవస్థల మన సొంతం. ఆ వ్యవస్థల గురించి తెలుసుకుందాం.

    #1

    Brahmos Missile: 

    భారతదేశం-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి, అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో ఒకటి.

    ఇది సుమారు మాక్ 2.8 వేగంతో అంటే గంటకు దాదాపు 3,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

    దీని ప్రాథమిక పరిధి 290 నుండి 450 కి.మీ. వరకు ఉంది, ప్రస్తుతం దీన్ని 600 కి.మీ.కు పెంచారు.

    స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణి, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల రాడార్‌లకు కనిపించకుండా లక్ష్యాన్ని చేరగలదు.

    ఇది అణు ఆయుధాలు, సాంప్రదాయ వార్‌హెడ్‌లు మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది.

    ఈ క్షిపణిని భూమి, సముద్రం లేదా గాలి నుండి ప్రయోగించవచ్చు. దీని బహుమార్గ ప్రయాణ సామర్థ్యం రాడార్ గుర్తింపును మరింత కష్టతరం చేస్తుంది.

    #2

    Rudram-1 Anti-Radiation Missile:

    భారతదేశంలో స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన రుద్రం-1 క్షిపణి, శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది.

    దీనిని సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించవచ్చు. ఇది సుమారు 100 నుండి 250 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సులభంగా తాకగలదు.

    శత్రు రాడార్ వ్యవస్థలను ఇది సమర్థంగా ధ్వంసం చేస్తుంది. స్టెల్త్ డిజైన్, పాసివ్ హోమింగ్ ఫీచర్‌తో, ఇది శత్రు రాడార్‌లకు దూరంగా ఉండగలదు.

    #3

    Kh-31P Anti-Radiation Missile:

    రష్యా తయారు చేసిన Kh-31P క్షిపణిని భారత వాయుసేన సుఖోయ్-30 MKI విమానాల ద్వారా ప్రయోగిస్తోంది.

    దీని పరిధి సుమారు 110 నుండి 250 కి.మీ. వరకు ఉంటుంది. శత్రు రాడార్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేస్తూ, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది.

    ఇది పాకిస్తాన్, చైనాకు చెందిన HQ-9 వాయు రక్షణ వ్యవస్థలను పని చేయకుండా చేయగల సామర్థ్యం కలిగి ఉంది.

    SEAD (Suppression of Enemy Air Defenses) వ్యూహాల్లో భాగంగా, 'ఆపరేషన్ సిందూర్'లో దీనిని వినియోగించారు.

    దీని అధిక వేగం, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వలన, రాడార్‌లకు కనిపించకుండా గమ్యాన్ని ఛేదిస్తుంది.

    #4

    Sky Striker (kamikaze drone):

    భారతదేశం, ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన ఈ స్కై స్ట్రైకర్ డ్రోన్, స్వయంచాలకంగా లక్ష్యాన్ని లాక్ చేసి దానిపై దాడి చేయగలదు.

    ఇది 20 నుండి 100 కి.మీ. పరిధిలో ప్రయోగించవచ్చు. దీని బాత్రీ సామర్థ్యం గరిష్ఠంగా 6 గంటల వరకు గాల్లో ఉండటానికి వీలు కల్పిస్తుంది.

    చిన్న పరిమాణం, స్టెల్త్ డిజైన్ వలన ఇది రాడార్‌లకు పట్టించకుండా, అత్యంత ఖచ్చితంగా దాడి చేస్తుంది.

    తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్, స్వయం నావిగేషన్ వ్యవస్థ దీన్ని మరింత ప్రమాదకరమైనదిగా చేస్తాయి.

    #5

    SCALP Missile:

    ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ స్టెల్త్ క్రూయిజ్ క్షిపణి, రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించబడుతుంది.

    దీని పరిధి సుమారు 300 నుండి 560 కి.మీ. వరకు ఉంటుంది. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ లోతైన బంకర్లను, ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేయగలదు.

    స్టెల్త్ డిజైన్, టెర్రైన్-ఫాలోయింగ్ నావిగేషన్ వ్యవస్థ వలన, ఇది రాడార్‌కు దొరకకుండా గమ్యాన్ని చేరుతుంది.

    #6

    SPICE-2000:

    ఇజ్రాయెల్ వేదికగా అభివృద్ధి చేయబడిన ఈ స్మార్ట్ బాంబు, మిరాజ్-2000 మరియు జాగ్వార్ విమానాల ద్వారా ప్రయోగించబడుతుంది.

    దీని పరిధి సుమారు 60 నుండి 100 కి.మీ. వరకు ఉంటుంది. ఇది GPS, ఎలక్ట్రో-ఆప్టికల్ గైడెన్స్ వ్యవస్థలతో పనిచేస్తుంది.

    2019లో బాలాకోట్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లో దీనిని ఉపయోగించారు. గ్లైడ్ బాంబ్‌గా ఉండటంతో, ఇది రాడార్‌లకు గుర్తించబడే అవకాశాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

    #7

    Harrop Drone:

    HAROP అని పిలవబడే ఈ డ్రోన్, దాదాపు 1,000 కి.మీ. పరిధి కలిగి ఉంటుంది.

    ఇది శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకెళ్లి దాడి చేయగలదు. ఇది 6 గంటల పాటు గాల్లో ఉండి, సరైన లక్ష్యం కోసం వేచి ఉండగలదు.

    ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లతో అమర్చబడి ఉండటం వలన, ఇది పగలు, రాత్రి రెండు సమయాల్లోను గమ్యాలను గుర్తించగలదు.

    గంటకు 185 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్, ప్రయోగించిన తర్వాత మానవ జోక్యం లేకుండా పనిచేస్తుంది. రాడార్ కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇది ఎక్స్‌పర్ట్ గా పనిచేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే భారతదేశం
    Turkey: తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది!  ప్రపంచం
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో బాలీవుడ్‌ మూవీ ప్రకటన.. పోస్టర్ రిలీజ్! ఆపరేషన్‌ సిందూర్‌
    India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత  భారతదేశం

    భారతదేశం

    Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక! పాకిస్థాన్
    India-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పాకిస్థాన్
    Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం పాకిస్థాన్
    Canada: భారత్‌తో సత్సంబంధాలపై మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025