Page Loader
Elon Musk: సునీతా విలియమ్స్,బారీ విల్మోర్‌లను తిరిగి తీసుకురమ్మని ట్రంప్‌ సాయం అడిగారు: మస్క్‌
సునీతా విలియమ్స్,బారీ విల్మోర్‌లను తిరిగి తీసుకురమ్మని ట్రంప్‌ సాయం అడిగారు: మస్క్‌

Elon Musk: సునీతా విలియమ్స్,బారీ విల్మోర్‌లను తిరిగి తీసుకురమ్మని ట్రంప్‌ సాయం అడిగారు: మస్క్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయాన్ని కోరినట్లు ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం (జనవరి 28) ఎక్స్ (ట్విటర్)లో ఒక పోస్టు ద్వారా ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అనే వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకోగా, వారిద్దరూ ప్రారంభంలో కేవలం పది రోజుల పాటు మాత్రమే అంతరిక్షంలో ఉండటానికి వెళ్లారు. అయితే, బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో వచ్చిన సాంకేతిక సమస్యలు కారణంగా, వారు తిరిగి భూమికి రాలేకపోయారు.

వివరాలు 

బైడెన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా..

ఇదే సందర్భంలో, బైడెన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకు అంతరిక్షంలోనే ఉన్నారని మస్క్ విమర్శించారు. మరోవైపు, సునీతా, విల్మోర్‌లను భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా, మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీకి సహాయం కోరినట్లు గత ఏడాది ఆగస్టులో ప్రకటించారు. దీనికి అనుగుణంగా, స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ నౌకను అంతరిక్షంలోకి పంపించి, అందులో రెండు ఖాళీ సీట్లను ఉంచింది. ఈ డ్రాగన్ నౌకలో సునీతా, విల్మోర్‌లను తిరిగి భూమికి తీసుకురావాల్సి ఉండగా, దీనికి సంబంధించి అనేక కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే, మస్క్‌ తాజాగా చేసిన పోస్టుతో, సునీత, విల్మోర్ త్వరలో భూమికి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్‌ చేసిన ట్వీట్