Sunita Williams: మార్చి 19న భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్.. ప్రకటించిన స్పేస్-X సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారతీయ మూలాల కలిగిన వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమికి చేరుకోనున్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోరోలను అంతరిక్షానికి పంపింది.
బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్న వీరిద్దరూ తమ మిషన్‌ను పూర్తిచేసిన అనంతరం తిరిగి భూమికి రావాల్సి ఉండగా, వారి క్యాప్సూల్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.
ఈ కారణంగా, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
వివరాలు
ఎలాన్ మస్క్ కు బాధ్యత అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
నాసా, వారిని భూమికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు అప్పగించారు.
దీని ప్రకారం, ది డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ మార్చి 12న ప్రయాణం ప్రారంభించి, మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోరోలను భూమికి తిరిగి తీసుకురానుంది.
దీంతో, దాదాపు 8 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన ఈ వ్యోమగాములు చివరకు భూమికి తిరిగి రానున్నారు.