
Ghibli: చాట్‌జీపీటీకి గంటలో 10 లక్షల యూజర్లు.. 'గిబ్లి ట్రెండ్ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తోంది': సామ్ ఆల్ట్‌మాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్.. ఇప్పుడు ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఓపెన్ చేయగానే ఫీడ్ మొత్తం జీబ్లీ (Ghibli) ఫొటోలతో నిండిపోతుంది.
ఓపెన్‌ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జీబ్లీ స్టూడియోను పరిచయం చేసిన తరువాత ఈ ఫీచర్ నెటిజన్ల మధ్య విపరీతంగా వినియోగంలో ఉంది.
ఈ నేపధ్యంలో చాట్‌జీపీటీకి యూజర్ల సంఖ్య చాలా పెరిగిపోతోంది. ఒక గంటలోనే మిలియన్ యూజర్లు కొత్తగా జతవేస్తున్నారని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు.
ఈ విషయంలో ఆయన ఎక్స్ వేదికపై ఓ పోస్టు పెట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సామ్ ఆల్ట్‌మాన్ చేసిన ట్వీట్
the chatgpt launch 26 months ago was one of the craziest viral moments i'd ever seen, and we added one million users in five days.
— Sam Altman (@sama) March 31, 2025
we added one million users in the last hour.
వివరాలు
గంటలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు
26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చినట్లు ఆల్ట్‌మన్ తెలిపారు.
ఐదు రోజుల్లోనే ఒక మిలియన్ యూజర్లు చేరినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే, తాజాగా జీబ్లీ ఫిల్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక గంటలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు చాట్‌జీపీటీకి చేరినట్లు ఆయన వెల్లడించారు.
జీబ్లీ ఇమేజ్ జనరేటర్‌కి యూజర్లు చూపిస్తున్న ఆదరణపై ఆల్టమన్ స్పందించిన విషయం తెలిసిందే.
"జీబ్లీ వాడకం విషయంలో యూజర్లు కొంచెం కూల్‌గా ఉంటే బాగుంటుంది. ఇది మా సిబ్బందికి నిద్ర లేని రాత్రులు తీసుకువస్తోంది" అని ఆయన చమత్కరించారు.
వివరాలు
గ్రోక్ లో కూడా ఈ ఫొటోల జనరేషన్ ఆప్షన్
అదే సమయంలో, ఈ ఫీచర్‌ను అత్యధికంగా వినియోగించడంతో తమ జీపీయూ (GPU) వ్యవస్థపై అధిక భారం పడుతోందని ఆల్ట్‌మన్ చెప్పారు.
అందువల్ల, దీనికి లిమిట్ పెడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉచిత యూజర్లకు రోజుకు మూడు జీబ్లీ ఫొటోల ఉత్పత్తి పరిమితం విధించబడింది.
అయితే, ప్రీమియం యూజర్లకు ఎలాంటి పరిమితి ఉండదు. మరోవైపు, గ్రోక్ లో కూడా ఈ ఫొటోల జనరేషన్ ఆప్షన్ విరివిగా ఉపయోగిస్తున్నారు.