
Subhanshu Shukla: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న శుభాంశు శుక్లాకు 'Shukx' కాల్‌సైన్ కేటాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి పయనం చేయబోయే తుది తేదీ ఖరారయ్యింది.
మే 29న ఆయన యాక్సియం-4 (AX-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు ప్రయాణించనున్నారు.
ఈ మిషన్‌లో ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ, హంగరీకు చెందిన టిబర్ కపు కూడా పాల్గొంటున్నారు.
ఈ ప్రయాణానికి సంబంధించినంతగా శుభాంశు శుక్లాకు "Shukx" అనే కాల్‌సైన్‌ను నాసా అందించింది.
వివరాలు
సైనిక విమానయాన రంగంలో వాడే కోడ్‌లు
కాల్‌సైన్ అనేది వ్యోమగాములకు కేటాయించే ప్రత్యేక గుర్తింపు పేరు లేదా కోడ్. అంతరిక్ష ప్రయాణాల సమయంలో వ్యోమగాములు పరస్పరం సంభాషించేటప్పుడు వీటినే ఉపయోగిస్తారు.
ఈ తరహా కోడ్‌లు ముఖ్యంగా సైనిక విమానయాన రంగంలో ఎక్కువగా వాడబడతాయి,తద్వారా పైలట్ల అసలు వివరాలు లేదా వారు ఎవరిద్వారా మాట్లాడుతున్నారు అన్న విషయం శత్రు దేశాలకు తెలియకుండా ఉండేలా చేయడం వీటి ప్రధాన ఉద్దేశం.
భారత కాలమానం ప్రకారం మే 29న రాత్రి 10:30 గంటలకు, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఈ నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనించనున్నారు.
వివరాలు
శుభాంశు శుక్లా కనీసం ఏడుకు పైగా ప్రయోగాలు
వారంతా రెండు వారాలపాటు ఐఎస్‌ఎస్‌లో ఉండనున్నారు. ఈ మిషన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా,భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి నిర్వహిస్తున్నాయి.
ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా కనీసం ఏడుకు పైగా ప్రయోగాలలో పాల్గొనబోతున్నట్టు సమాచారం.
అందులో భాగంగా అంతరిక్షంలో పంటల పెంపకం, వాటర్ బేర్ (నీటి ఎలుగుబంటి అనే సూక్ష్మ జీవి)లపై అధ్యయనం చేయనున్నారు.
ముఖ్యంగా భారతీయ ఆహార సంస్కృతికి సంబంధించిన పంటలపై ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
ఇందులో మెంతి, పెసలు వంటి మొలకల పెంపకం, వాటి వృద్ధిపై పరిశీలన జరగనుంది.
ఈ మొలకలను అనంతరం భూమికి తీసుకొచ్చి, నేలలో అవి ఎలా పెరుగుతున్నాయనే అంశాన్ని గమనించనున్నారు.