Page Loader
చందమామపై ప్రయోగాలకు ప్రపంచదేశాలు పోటీ.. ఇంతకీ చంద్రుడిపై హక్కులు ఎవరెవరికో తెలుసా?
చంద్రుడి వనరులపై హక్కులు ఎవరివి

చందమామపై ప్రయోగాలకు ప్రపంచదేశాలు పోటీ.. ఇంతకీ చంద్రుడిపై హక్కులు ఎవరెవరికో తెలుసా?

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 24, 2023
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్‌, నింగిలో ఇప్పటివరకు ఏ దేశానికీ దక్కని లక్ష్యం, గమ్యం ఇండియాకు దక్కింది. ఈ మేరకు అత్యంత సంక్లిష్టమైన జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఇస్రో, విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఓ ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తుంది. చందమామపై హక్కులు ఎవరికి సొంతం అనే ప్రశ్న మొదలైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారిగా భారత్ పాదమోపింది. కనుక జాబిల్లిపై భూములు, ఖనిజాలపై హక్కులు ఇండియాకే ఉంటాయా లేదా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ దక్షిణ ధ్రువంలో ఏమెమున్నాయి. వాటిపై హక్కులు ఎవరెవకీ సంక్రమిస్తాయి అనే ఆలోచనలు మొదలవుతున్నాయి.

DETAILS

అత్యంత విలువైన ఖనిజాలను దాచుకున్న చందమామ

చంద్రుడు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలను తనలో ఇముడుచున్నాడు. హైడ్రాక్సిల్‌ అణువుల రూపంలో నీటి జాడలున్న విషయాన్ని 2008లోనే చంద్రయాన్‌-1 గుర్తించింది. భూమిపై అరుదుగా లభించే అత్యంత విలువైన హీలియం-3 ఖనిజ నిల్వలైతే చంద్రుడి వద్ద టన్నుల కొద్దీ ఉన్నాయని అమెరికా నాసా ప్రకటించింది. రేడియోధార్మికత లేని ఈ ఖనిజాన్ని కాలుష్య నివారణ కోసం న్యూక్లియర్‌ ఎనర్జీలో భాగంగా వినియోగించుకోవచ్చని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. స్కాండియం, యట్రియం, సహా 15 రకాల లాంథనైడ్స్‌ ఉన్నాయని బోయింగ్‌ సంస్థ పేర్కొంది. చందమామపై మైనింగ్‌ చాలా కష్టతరమైంది. ఎందుకంటే అక్కడి ప్రతికూల వాతావరణంలో మానవులు ఉండలేరు. పగలు 127డిగ్రీల సెల్సియస్‌, రాత్రి -173 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఈ మేరకు రోబోలే కీలకంగా మారతాయి.

details

 ఖగోళంపై ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకంగా హక్కుల్లేవ్

అయితే ఇప్పటివరకు చంద్రుడిపై ఏ దేశానికీ ఆస్తి, ఖనిజ హక్కులు ఇవ్వలేదు.1966లో ఐక్యరాజ్య సమితి అవుటర్‌ స్పేస్‌ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఖగోళంపై ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకంగా హక్కులు అంటూ ఉండవు. జాబిల్లి ఏ ఒక్క దేశానికి ఆస్తి కాదని 1979లో మరో ఒప్పందం జరిగింది.చంద్రుడిపై సేఫ్టీ జోన్స్‌ ఏర్పాటు, అంతర్జాతీయ అంతరిక్ష చట్టం కోసం 2020లోనే అమెరికా ఆర్టెమిస్‌ అకార్డ్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఒప్పందానికి చైనా రష్యా దూరంగా ఉండగా, భారత్ మాత్రమే సంతకం చేయడం గమనార్హం. ప్రస్తుతం లూనార్ స్పేస్ మిషన్(చందమామ)పై పరిశోధనలు పెరుగుతున్న దృష్ట్యా మైనింగ్‌పై స్పెషల్ పాలసీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. దీంతో భవిష్యత్ లో దేశాల మధ్య ఇబ్బందులు లేకుండా ఉంటుంది.