Wrold Cup 2023: 2019, 2023 ప్రపంచ కప్ జట్టుకి భారత జట్టులో మార్పులివే!
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. 2023 వన్డే వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన జట్టులో 2019 వరల్డ్ కప్ ఆడిన పలువురు ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ 2019 వన్డే వరల్డ్ కప్ ఆడి, 2023 వరల్డ్ కప్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇక భారత్ జట్టు శిఖర్ ధావన్ లేకుండా 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఐసీసీ వన్డే టోర్నీని ఆడనుంది.
మహ్మద్ సిరాజ్ పై భారీ ఆశలు
ప్రస్తుతం ధావన్ స్థానంలో శుభ్‌మాన్ గిల్ స్థానం సంపాదించుకున్నాడు. దినేష్ కార్తీక్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఎంఎస్ ధోని స్థానంలో ఇషాన్ కిషన్ ఆడబోతున్నారు. లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్, కేదార్ జాదవ్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ప్రపంచ కప్ జట్టుకి ఎంపికయ్యారు. రిషబ్ పంత్ గాయం కారణంగా ప్రపంచ కప్‌కి దూరం కావడంతో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. వీరిద్దరిలో ఒకరు మాత్రమే ఆడే ఛాన్స్ ఉండనుంది. ఫాస్ట్ బౌలర్ జాబితాలో భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఎంపికైన మహ్మద్ సిరాజ్ పై భారత జట్టు భారీ ఆశలనే పెట్టుకుంది.