IPL Captains: ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని కెప్టెన్‌లు ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ లీగ్‌లో ఒక్క బంతి, ఒక్క పరుగు, లేదా ఒక్క క్యాచ్ కూడా మ్యాచ్ ఫలితాలను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో ఓటమి ఎరుగని కెప్టెన్లు కూడా ఉన్నారనే విషయం ఆసక్తికరం. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి అత్యుత్తమ కెప్టెన్లకు కూడా సాధ్యం కాని ఫీట్‌ని సాధించిన కొందరు కెప్టెన్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూర్యకుమార్ యాదవ్
ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ 2023 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కి తాత్కాలిక కెప్టెన్సీ చేయడానికి అవకాశం దక్కించుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో సూర్య నేతృత్వం వహించాడు, ఆ మ్యాచ్‌లో ముంబయి విజయాన్ని సొంతం చేసుకుంది. సూర్య ఈ విజయంతో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డ్ కలిగిన ప్లేయర్‌గా నిలిచాడు. రాస్ టేలర్:న్యూజిలాండ్ లెజెండరీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఐపీఎల్‌లో ఓటమిని ఎరుగని కెప్టెన్. 2013 సీజన్‌లో పూణె వారియర్స్ జట్టుకు ఒకే ఒక్క మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి,చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయాన్ని సాధించాడు.ఈ మ్యాచ్‌లో టేలర్ తన అనుభవంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
నికోలస్ పూరన్
వెస్టిండీస్ వికెట్ కీపర్-బ్యాటర్ నికోలస్ పూరన్ 2024 ఐపీఎల్ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు ఒక మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో పూరన్ దూకుడైన, వ్యూహాత్మక కెప్టెన్సీతో లఖ్‌నవూ జట్టును విజయం సాధింపజేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లూ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఒక్కసారి కూడా ఓడిపోకుండా, ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నారు.