Page Loader
IND vs NZ: న్యూజిలాండ్ తో చివరి టెస్ట్.. మూడు మార్పులతో టీమిండియా!  
న్యూజిలాండ్ తో చివరి టెస్ట్.. మూడు మార్పులతో టీమిండియా!

IND vs NZ: న్యూజిలాండ్ తో చివరి టెస్ట్.. మూడు మార్పులతో టీమిండియా!  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2024
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్ ఓటమిని ఎదుర్కొంది. తొలి టెస్టులోలాగే రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాటర్లు పేలవంగా ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చివరి టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో మరికొన్ని మార్పులు చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రెండో టెస్టులో మూడు మార్పులు చేసిన సంగతి తెలిసిందే.కేఎల్ రాహుల్, కుల్‌దీప్‌, సిరాజ్ స్థానాల్లో గిల్, సుందర్, ఆకాశ్‌కి అవకాశం ఇచ్చింది. అయితే,ఈ మార్పులు సైతం భారత్‌ని గెలిపించలేకపోయాయి. ఇప్పుడు చివరి టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలన్న లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. అందువల్ల కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కూడా యోచిస్తోంది.

వివరాలు 

సిరాజ్‌కి అవకాశం 

తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించని మహ్మద్ సిరాజ్‌ని రెండో టెస్టులో పక్కన పెట్టారు.కానీ ఇప్పుడు చివరి టెస్టులో అతడికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయి. వర్క్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి, ఆకాశ్‌దీప్‌తో కలిసి సిరాజ్‌తో బౌలింగ్ దాడిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ త్వరలోనే మొదలవుతుంది కాబట్టి, బుమ్రాకి విశ్రాంతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

వివరాలు 

పంత్‌ స్థానంలో ధ్రువ్ 

తొలి టెస్టులో గాయపడిన రిషభ్‌ పంత్ పుణె టెస్టుకు సిద్ధమవుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ పంత్‌ అనూహ్యంగా కోలుకుని రెండో టెస్టు ఆడాడు. అయితే చివరి టెస్టులో అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌కి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ సిరీస్‌లో ధ్రువ్‌ సబ్‌స్టిట్యూట్‌ వికెట్ కీపర్‌గా సేవలందించాడు. పంత్‌ నాలుగు ఇన్నింగ్స్‌లలో 137 పరుగులు సాధించాడు కాబట్టి, ధ్రువ్‌ ఆ లోటును భర్తీ చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

జడేజాకు విశ్రాంతి 

కివీస్ తో టెస్టు సిరీస్ కోసం నలుగురు స్పిన్ ఆల్‌రౌండర్లను భారత్ ఎంపిక చేసింది. అయితే, అక్షర్ పటేల్‌కు ఈ సిరీస్‌లో అవకాశమే రాలేదు. ఇప్పుడు మూడో టెస్టులో అతడిని బరిలోకి దింపాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది.