LOADING...
 IND vs ENG : దంచికొట్టిన భార‌త బ్యాటర్లు .. ఇంగ్లాండ్‌ లక్ష్యం 357
దంచికొట్టిన భార‌త బ్యాటర్లు .. ఇంగ్లాండ్‌ లక్ష్యం 357

 IND vs ENG : దంచికొట్టిన భార‌త బ్యాటర్లు .. ఇంగ్లాండ్‌ లక్ష్యం 357

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ఇండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఫలితంగా, ఇంగ్లాండ్‌కు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (112; 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (78; 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు),విరాట్ కోహ్లీ (52; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. కేఎల్ రాహుల్ (40; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇంగ్లాండ్‌ లక్ష్యం 357